బిగ్‌బాస్ 7 విన్నర్ ప్రశాంత్ అరెస్ట్‌పై స్కిట్.. ముఖం మాడ్చుకున్న శివాజీ! | Sivaji Serious On Pallavi Prashanth Arrest Skit Latest Promo In Extra Jabardasth, Deets Inside - Sakshi
Sakshi News home page

Pallavi Prashanth-Sivaji: రైతుబిడ్డకు జరిగిన కాంట్రవర్సీ, బాధని కామెడీ చేసి పడేశారు!

Published Mon, Jan 22 2024 3:41 PM

Sivaji Serious On Pallavi Prashanth Arrest Skit Extra Jabardasth Promo Latest - Sakshi

బిగ్‌బాస్ 7 షో దాదాపు నెలన్నర క్రితమే అయిపోయింది. రైతుబిడ్డ అని చెప్పుకొన్న పల్లవి ప్రశాంత్ విజేతగా నిలిచాడు. ఫైనల్ తర్వాత హైదరాబాద్ రోడ్లపై నానా రచ్చ చేశాడు. అతడి అభిమానులైతే.. ఆర్టీసీ బస్సులతో పాటు పలువురు కార్లని కూడా ధ్వంసం చేశారు. దీంతో ప్రశాంత్‌ని పోలీసులు అరెస్ట్ చేశారు. అయితే ఇంత సీరియస్ విషయాన్ని ఇప్పుడు కామెడీ చేసి పడేశారు.

గతంలో ఎప్పుడూ లేని విధంగా బిగ్‌బాస్ 7వపై బోలెడన్ని విమర్శలు వచ్చాయి. మరీ ముఖ్యంగా శివాజీ ఆటతీరు, షోలో అమ్మాయిలపై చేసిన వల్గర్ కామెంట్స్.. షో చూడాలనే ఆసక్తిని పూర్తిగా చంపేశాయి. ఇక బిగ్‌బాస్ హౌస్ నుంచి బయటకొచ్చిన తర్వాత కూడా శివాజీ బుర్ర ఇంకా అలానే ఉండిపోయింది. అమర్, శోభాపై పిచ్చిపిచ్చి కామెంట్స్ చేశాడు.

(ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లో 27 సినిమాలు రిలీజ్.. అదొక్కటి స్పెషల్)

సరే ఇదంతా పక్కనబెడితే శివాజీ ఈ మధ్య ఓ వెబ్ సిరీస్‌లో యాక్ట్ చేశాడు. ఓటీటీలో అది ప్రేక్షకుల్ని అలరిస్తోంది. దాని ప్రమోషన్స్ కోసం ప్రముఖ కామెడీ షోకి వచ్చాడు. అయితే చాలా కాంట్రవర్సీ అయిన పల్లవి ప్రశాంత్ అరెస్ట్‌ని ఇందులో స్కిట్‌గా వేశారు. పాపం అంత సీరియస్ విషయాన్ని పూర్తిగా కామెడీ చేసి పడేశారు. స్కిట్ చూస్తున్న టైంలో శివాజీ ముఖమైతే పూర్తిగా మాడిపోయింది. ఏదో తెచ్చిపెట్టుకున్నట్లు కాస్త నవ్వాడు అంతే! తాజాగా రిలీజ్ చేసిన ప్రోమోలో ఇదంతా ఉంది.

అయితే బిగ్‌బాస్ షోలోకి రాకముందు శివాజీపై కొందరి వరకు కాస్త మంచి అభిప్రాయం ఉండేది. కానీ ఎప్పుడైతే ఈ షోలో పార్టిసిపేట్ చేశాడో.. తన ప్రవర్తనతో ఉన్న ఆ కాస్త పరువు కూడా పోగొట్టుకున్నాడు! ఇప్పుడు అదే శివాజీకి దోస్త్ అయిన ప్రశాంత్ అరెస్టుపై స్కిట్ వేసి.. శివాజీని సైలెంట్ అయిపోయేలా చేసేపడేశారు.

(ఇదీ చదవండి: 14 నెలల తర్వాత ఓటీటీలోకి వచ్చేసిన సినిమా.. ఫ్రీగా చూసే ఛాన్స్)

Advertisement
 
Advertisement
 
Advertisement