రూ.3 కోట్ల ఆఫర్‌.. అక్కర్లేదని రిజెక్ట్‌ చేశాం: శివబాలాజీ దంపతులు | Siva Balaji, Madhumitha about Betting App Promotions | Sakshi
Sakshi News home page

Siva Balaji- Madhumitha: ప్రమోషన్‌కు రూ.3 కోట్లు.. అలాంటివి మాకక్కర్లేదు

Mar 31 2025 2:33 PM | Updated on Mar 31 2025 3:58 PM

Siva Balaji, Madhumitha about Betting App Promotions

బెట్టింగ్‌ యాప్స్‌ (Betting Apps).. ముందు నమ్మిస్తాయి, తర్వాత ముంచేస్తాయి. అది తెలియని అమాయకులు.. అన్ని కష్టాలకు ఒకే ఒక్క పరిష్కారం ఇదేనంటూ బెట్టింగ్‌ యాప్స్‌ వలలో పడుతున్నారు. చివరకు ఉన్నదంతా కోల్పోయి, అప్పుల ఊబిలో కూరుకుపోయి ప్రాణాలు తీసుకునేందుకు కూడా వెనుకాడం లేదు. ఇలాంటి యాప్స్‌ను బుల్లితెర సెలబ్రిటీల నుంచి సినిమా స్టార్స్‌ వరకు చాలామంది ప్రమోట్‌ చేస్తున్నారు.

బెట్టింగ్‌ యాప్స్‌ ప్రమోట్‌ చేయమని అడిగారు
ఇప్పుడిప్పుడే తప్పు తెలుసుకుని కొందరు దానికి దూరంగా ఉంటున్నారు. అయితే ఈ యాప్స్‌ ప్రమోట్‌ చేయమని తనను కూడా సంప్రదించారంటున్నాడు టాలీవుడ్‌ నటుడు, బిగ్‌బాస్‌ విన్నర్‌ శివబాలాజీ (Shiva Balaji). శివ బాలాజీ, భార్య మధుమిత (Madhumitha)తో కలిసి ఇటీవల ఓ సాంగ్‌ చేశాడు. ఈ పాట రిలీజైన నేపథ్యంలో వీరిద్దరూ ఓ యూట్యూబ్‌ ఛానల్‌కు ఇంటర్వ్యూ ఇచ్చారు.

రూ.3 కోట్ల ఆఫర్‌
ఈ సందర్భంగా శివ బాలాజీ, మధుమిత మాట్లాడుతూ.. బెట్టింగ్‌ యాప్స్‌ ప్రమోట్‌ చేయమని రూ.3 కోట్ల ఆఫర్‌ ఇచ్చారు. ట్రేడింగ్‌, బెట్టింగ్‌.. ఇలా చాలావాటిని ప్రమోట్‌ చేయమని అడుగుతుంటారు. మమ్మల్ని ఫాలో అయే అభిమానులను ఫ్యామిలీగా భావిస్తాం. వారినెప్పుడూ సరైన దారిలోనే నడవాలని ఎంకరేజ్‌ చేస్తాం తప్ప పొరపాటున కూడా తప్పులు సలహాలు, సూచనలు ఇవ్వం. అందుకే అలాంటి ప్రమోషన్స్‌ చేయలేదు. చేయము కూడా! అని పేర్కొన్నారు.

చదవండి: 'జయం' సినిమాలో హీరోయిన్‌ రష్మీ గౌతమ్‌.. చివర్లో: నితిన్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement