కోలీవుడ్‌ టూ బాలీవుడ్‌.. ఇండస్ట్రీని కుదిపేస్తోన్న సుచిత్ర కామెంట్స్! | Singer Suchitra allegations Karan Johar and Shah Rukh Khan | Sakshi
Sakshi News home page

Suchitra: షారుక్‌, కరణ్‌పై సింగర్‌ సుచిత్ర సంచలన కామెంట్స్‌!

May 17 2024 7:25 PM | Updated on May 17 2024 7:43 PM

Singer Suchitra allegations Karan Johar and Shah Rukh Khan

సింగర్‌ సుచిత్ర కోలీవుడ్‌ షేక్ చేస్తోంది. రోజుకొక బాంబు పేలుస్తోంది. గతంలో సుచీలీక్స్‌ పేరిట సంచలనం విషయాలు బయటపెట్టిన ఆమె మరోసారి హాట్‌ టాపిక్‌గా మారింది. కోలీవుడ్‌ ఇండస్ట్రీలోని ప్రముఖుల గురించి సంచలన కామెంట్స్‌ చేస్తూ వార్తల్లో నిలుస్తోంది. ఇప్పటికే తన మాజీ భర్త కార్తీక్ కుమార్, ధనుశ్, త్రిష, కమల్‌హాసన్‌ను ఉద్దేశించి చేసిన కామెంట్స్‌ ఇప్పటికే చర్చనీయాంశంగా మారాయి.

ఈ నేపథ్యంలో మరోసారి సంచలన కామెంట్స్‌ చేసింది. ‍అయితే ఈ సారి బాలీవుడ్‌ ప్రముఖులను టార్గెట్‌ చేసింది. బాలీవుడ్ బాద్‌షా షారుక్ ఖాన్, నిర్మాత కరణ్‌ జోహార్‌పై తీవ్రమైన ఆరోపణలు చేసింది. లండన్‌ ట్రిప్‌లో కార్తీక్‌ కుమార్, షారుక్, కరణ్‌ కలిసి గే పార్టీలకు వెళ్లారని ఆరోపించింది. ఎక్కడైతే స్వలింగ సంపర్కులకు చట్టబద్ధమైన అనుమతి ఉందో అలాంటి దేశాలకు వెళ్లేవారని తెలిపింది. దీంతో మరోసారి సుచిత్ర చేసిన కామెంట్స్‌ సోషల్ మీడియాలో పెద్దఎత్తున వైరల్‌గా మారాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement