Sravana Bhargavi Deleted Okapari Kokapari Vayyarame Song - Sakshi
Sakshi News home page

Sravana Bhargavi: వివాదాస్పద వీడియోను డిలీట్‌ చేసిన శ్రావణ భార్గవి..

Jul 23 2022 7:38 PM | Updated on Jul 23 2022 8:17 PM

Singer Sravana Bhargavi Deleted Okapari Song - Sakshi

టాలీవుడ్‌లో సింగర్‌గా మంచి పేరు తెచ్చుకుంది శ్రావణ భార్గవి. తన యూట్యూబ్‌ ఛానెల్‌లో విభిన్నమైన వ్లోగ్స్‌ చేస్తూ నెటిజన్లను అలరిస్తోంది. అయితే ఆమె గతకొంతకాలంగా వివాదస్పదంలో చిక్కుకుంది. దీంతో సోషల్ మీడియాలో శ్రావణ భార్గవి పేరు మారుమోగిపోతోంది.

Singer Sravana Bhargavi Deleted Okapari Song: టాలీవుడ్‌లో సింగర్‌గా మంచి పేరు తెచ్చుకుంది శ్రావణ భార్గవి. తన యూట్యూబ్‌ ఛానెల్‌లో విభిన్నమైన వ్లోగ్స్‌ చేస్తూ నెటిజన్లను అలరిస్తోంది. అయితే ఆమె గతకొంతకాలంగా వివాదస్పదంలో చిక్కుకుంది. దీంతో సోషల్ మీడియాలో శ్రావణ భార్గవి పేరు మారుమోగిపోతోంది. ఇందుకు కారణం ఆమె చిత్రీకరించిన 'ఒకపరి కొకపరి వయ్యారమై' వీడియోనే. అన్నమయ్య కీర్తనను వెకిలీ చేష్టలతో చిత్రీకరించి వీడియో రిలీజ్‌ చేసిందని అన్నమయ్య వంశస్తులు ఆమెపై మండిపడ్డారు. ఈ విషయంపై కోర్టుకు కూడా వెళతామని హెచ్చరించిన విషయం తెలిసిందే. 

అయితే ఆమె చేసిన వీడియోలో ఎలాంటి తప్పు లేదని, అది మీ చూపులోనే ఉందని, దుప్పటి కప్పుకున్న అశ్లీలంగానే కనిపిస్తుందని శ్రావణ భార్గవి స్ట్రాంగ్ కౌంటర్‌ కూడా ఇచ్చింది. దీంతో ఈ వివాదం మరింత రాజుకుంది. ఆ వీడియోను యూట్యూబ్ నుంచి డిలీట్‌ చేయాల్సిందేనని పట్టుబట్టారు. ఆ వీడియోలో ఎలాంటి తప్పు లేదని, అభ్యంతరకరంగా ఉంటే దైవానుగ్రహం దక్కదని, అందుకే వీడియోను డిలీట్‌ చేసేది లేదని తేల్చిచెప్పింది. ఇక తీవ్ర ఆగ్రహానికి లోనైన తిరుపతి వాసులు గళం విప్పారు. శ్రావణ భార్గవి తీరుపై తిరుపతి తూర్పు పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. పలువురు నిరసనలు కూడా తెలిపారు.

చదవండి: మిస్‌ ఇండియా సినీ శెట్టికి ఇష్టమైన తెలుగు హీరో అతడే..
బాలీవుడ్‌ హీరోలు ఆ విషయంలో భయపడుతున్నారు: అక్షయ్‌ కుమార్‌

దీంతో చేసేదిలేక శ్రావణ భార్గవి తన యూట్యూబ్ ఛానెల్‌ నుంచి 'ఒకపరి కొకపరి వయ్యారమై' వీడియోను డిలీట్ చేసింది. శ్రావణ భార్గవి ఓ మెట్టు దిగి ఆ వీడియోను తొలగించడంతో తిరుపతి వాసులు, అన్నమయ్య వంశస్తులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. 

చదవండి: ఏందయ్యా రాహుల్‌ ఈ తమాషా.. నటుడి న్యూడ్‌ పిక్‌ వైరల్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement