స్టార్ సింగర్ చిన్మయి ఆగ్రహం.. తనకు జరిగిన అన్యాయంపై వరస ట్వీట్స్

Singer Chinmayi Sripada Tweet On Vairamuthu Book Launch - Sakshi

ప్రముఖ సింగర్ చిన్మయి మరోసారి తన రెచ్చిపోయింది. తనని లైంగికంగా వేధించి, కెరీర్ సర్వనాశనం అయ్యేలా చేసిన వ్యక్తిపై, అతడితో పాటు ఉన్న కమల్ హాసన్, పి.చిదంబరం, సీఎం స్టాలిన్ తీరుపై అసహనం వ్యక్తం చేసింది. ఇప్పుడు ఈ విషయం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. సింగర్ చిన్మయి వివాదం మరోసారి తెరపైకి వచ్చింది.

(ఇదీ చదవండి: ఎంగేజ్‌మెంట్ చేసుకున్న 'దసరా' విలన్.. అమ్మాయి ఎవరో తెలుసా?)

అసలేం జరిగింది?
ప్రముఖ తమిళ రచయిత వైరముత్తు రాసిన 'మహా కవితై' పుస్తకావిష్కరణ తాజాగా చెన్నైలో జరిగింది. దీనికి తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్, సీనియర్ కాంగ్రెస్ నాయకుడు పి.చిదంబరం, స్టార్ హీరో కమల్‌హాసన్ తదితరులు హాజరయ్యారు. 'నన్ను వేధింపులకు గురిచేసిన వ్యక్తితో కలిసి తమిళనాడుకు చెందిన కొందరు ప్రముఖులు వేదికపై ఉన్నారు. అతడి గురించి బయటకు చెప్పిన నేను మాత్రం నిషేధానికి గురయ్యాను. కొన్నేళ్లపాటు నా వృత్తి జీవితాన్ని కోల్పోయాను. నా కోరిక నెరవేరేవరకు ప్రార్ధించడం మినహా నేను చేసేది ఏమీలేదు' అని చిన్మయి ట్వీట్స్ చేసింది.

అసలేంటి గొడవ?
సింగర్, డబ్బింగ్ ఆర్టిస్ అయిన చిన్మయి.. 2018లో రైటర్ వైరముత్తుపై ఆరోపణలు చేసింది. తనని ఈయన లైంగికంగా వేధించాడని బయటపెట్టింది. మీటూ ఉద్యమం జరుగుతున్న సమయంలో చిన్మయి ఈ ఆరోపణలు చేసింది. ఈమెతో పాటు పలువురు కూడా వైరముత్తు నిజస్వరూపాన్ని బయటపెట్టారు. అయితే వైరముత్తుపై చర్యలు తీసుకోవాల్సింది పోయి.. తమిళ ఇండస్ట్రీలో చిన్మయిపై నిషేధం విధించారు. దీంతో అప్పటినుంచి వైరముత్తపై చిన్మయి ఎప్పటికప్పుడు విరుచుకపడుతూనే ఉంది. ఇప్పుడు కూడా అలానే వైరముత్తుకి సపోర్ట్ చేస్తున్న స్టాలిన్, కమల్ తదితరులపై కూడా విమర్శలు చేసింది.

(ఇదీ చదవండి: న్యూ ఇయర్ స్పెషల్.. ఈ వారం ఓటీటీల్లోకి ఏకంగా 25 సినిమాలు)

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top