
దాదాపు 35 ఏళ్ల తర్వాత తమిళంలో తెరకెక్కిన పురాణ కథాచిత్రం రాహుకేతు అని చిత్ర యూనిట్ పేర్కొంది. ప్రఖ్యాత దివంగత దర్శకుడు ఏపీ నాగరాజన్ రూపొందించిన భక్తిరస చిత్రాల తర్వాత ఇంతవరకు పురాణ గాథలతో రూపొందిన చిత్రాలు రాలేదని.. ఆ లోటును రాహుకేతు తీర్చనుందని చెప్తున్నారు. ఈ మూవీలో సముద్రఖని మహాశివుడిగా, నటి కస్తూరి దుర్గాదేవిగా, విగ్నేష్ శ్రీమహావిష్ణువుగా ప్రధాన పాత్రలు పోషించారు.
తమిళం థియేటర్స్ పతాకంపై శాంతి బాలచందర్ నిర్మించారు. ఎస్ ఆనంద్, వి. ఉమాపతి సహనిర్మాతలుగా వ్యవహరించిన ఈ చిత్రానికి కథ మాటలు పాటలను కలయిమామని కేపీ అరివానందన్ సమకూర్చగా తమిళమణి దురై బాలచందర్ దర్శకత్వం వహించారు. నిర్మాణ కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ చిత్రం ఆగస్టు 8న విధులకు సిద్ధమవుతోంది.
ఈ సందర్భంగా దర్శకుడు తమిళమణి దురై బాలచందర్ మాట్లాడుతూ.. ఇది రాహు కేతువుల జన్మ వృత్తాంతం.. అలాగే ప్రజలపై వారి ప్రభావం వంటి పలు ఆసక్తికరమైన అంశాలతో ఈ చిత్రం రూపొందించామన్నారు. దీనికి భరణి కుమార్ నేపథ్య సంగీతాన్ని అందించగా గిటారిస్ట్ సదానందం మూడు పాటలకు సంగీతాన్ని అందించారని చెప్పారు.