పేరుకే చిన్న సినిమా.. కానీ ఆరుగురు మ్యూజిక్ డైరెక్టర్స్! | Actor Richard Rishi Sila Nodigal Movie Had Six Music Directors, Interesting Deets Inside - Sakshi
Sakshi News home page

చిన్న మూవీ.. కానీ సంగీత దర్శకులేమో ఆరుగురు

Oct 2 2023 4:39 PM | Updated on Oct 2 2023 5:58 PM

Sila Nodigal Movie Had Six  Music Directors - Sakshi

రిచర్డ్ రిషి హీరోగా నటిస్తున్న సినిమా 'సిల నొడిగళిల్‌'. పున్నగై పూ గీత, యాషిక ఆనంద్‌ హీరోయిన్లుగా చేస్తున్నారు. వినయ్‌ భరద్వాజ్‌ దర్శకుడు. ఈయన సింగపుర్‌లో 12 ఏళ్లుగా బ్యాంక్‌ ఉద్యోగం చేసి ఆ తర్వాత.. సలాం నమస్తే సింగపూర్‌, స్టార్‌ టాక్‌ విత్‌ వినయ్‌ వంటి అంతర్జాతీయ టాక్ షోలకు వ్యాఖ్యాతగా చేశారు. పలు వెబ్‌ సిరీస్‌లకు దర్శకత్వం వహించారు. ఈనేపథ్యంలో ఆయన తొలిసారిగా డైరెక్షన్‌ చేస్తున్న తమిళ చిత్రం సిల నొడిగళిల్‌. 

(ఇదీ చదవండి: 'బిగ్‪‌బాస్' ఎలిమినేషన్ తర్వాత రతిక ఫస్ట్ రియాక్షన్)

పున్నగై పూ గీత ఎస్క్వైర్‌ ప్రొడక్షనన్స్‌ యూకే సంస్థ నిర్మిస్తున్న ఈ చిత్రం గురించి దర్శకుడు మాట్లాడుతూ.. ఇది మిస్టరీ సినిమా అన్నారు. పెళ్లయిన జంట బ్యాక్ డ్రాప్ స్టోరీతో సాగే ఈ చిత్రం లండన్‌ తీశామని చెప్పారు. ఇందులోని ఐదు పాటలకు మసాలా కేఫ్‌, స్టాకట్టో మ్యూజిక్‌ బ్యాండ్‌, బిజోర్న్‌ సుర్రావ్‌, దర్శన కేటీ, రోహిత్‌ లాంటి ఐదుగురు సంగీత దర్శకులు పనిచేశారని చెప్పారు. నేపథ్య సంగీతాన్ని ప్రముఖ బాలీవుడ్‌ సంగీత దర్శకుడు రోహిత్‌ కులకర్ణి అందించినట్లు క్లారిటీ ఇచ్చారు. ఇలా ఓ చిన్న సినిమా కోసం ఆరుగురు సంగీత దర్శకులు అంటే సాహసమనే చెప్పాలి. 

(ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లోకి ఏకంగా 29 సినిమాలు)

Advertisement
 
Advertisement
Advertisement