'బిగ్‪‌బాస్' ఎలిమినేషన్ తర్వాత రతిక ఫస్ట్ రియాక్షన్ | Rathika Rose First Reaction After Eliminated From Bigg Boss 7 Telugu, Post Trending On Social Media - Sakshi
Sakshi News home page

Rathika First Post After BB: 'బిగ్‌బాస్ 7'లో రతికకు అన్యాయం జరిగిందా? మరి ఆ పోస్ట్!

Oct 2 2023 4:17 PM | Updated on Oct 2 2023 4:42 PM

Rathika First Reaction After Bigg Boss 7 Elimination - Sakshi

'బిగ్‌బాస్ 7' తెలుగు నుంచి హాట్ బ్యూటీ ఎలిమినేట్ అయిపోయింది. మొదటివారం నుంచి నామినేట్ అవుతూ వచ్చిన రతిక.. నాలుగో వారం హౌస్ నుంచి బయటకొచ్చేసింది. అయితే టైటిల్ ఫేవరెట్స్‪‌లో ఒకరైన ఇంత త్వరగా వచ్చేయడం చాలామందికి ఆశ్చర్యం కలిగింది. ఇప్పుడు ఎలిమినేషన్ తర్వాత రతిక నుంచి ఫస్ట్ రియాక్షన్ వచ్చేసింది.

ఎలిమినేషన్‌కి కారణాలు?
రతిక.. బిగ్‌బాస్ హౌసులోకి మంచి కాన్ఫిడెన్స్‌తో అడుగు పెట్టింది. తొలివారం ఈమెని చూస్తే కచ్చితంగా టాప్-5లో ఉంటుందని అనిపించింది. కానీ ఆ తర్వాత ఈమె పూర్తిగా మారిపోయింది. ప్రశాంత్, యవర్‌తో ఉంటూ వాళ్లకే వెన్నుపోటు పొడిచింది. వీళ్లిద్దరితో చనువుగా ఉంటూ గేమ్ పక్కనబెట్టేసింది. మాజీ బాయ్‌ఫ్రెండ్ పేరు చెప్పి సింపతీ కొట్టేద్దామనుకుంది. ఇలా పలు కారణాల వల్ల రతిక ఎలిమినేట్ అయిపోయినట్లు అనిపిస్తుంది.

(ఇదీ చదవండి: 'బిగ్‌బాస్ 7'లో రతిక రెమ్యునరేషన్ అన్ని లక్షలా?)

షాకింగ్ పోస్ట్
అయితే బిగ్‌బాస్ 7 నుంచి ఎలిమినేట్ అయిపోయిన తర్వాత రతిక.. తన ఇన్ స్టాలో పోస్ట్ పెట్టింది. 'థాంక్యూ ఎవ్రీవన్. డోంట్ జడ్జ్ ఏ బుక్ బై ఇట్స్ కవర్(దేర్ వజ్ మచ్ మోర్ దేన్ వాట్ వూ సా)' అని చెప్పింది. అంటే.. 'షోలో నన్ను చూసి మీరు ఓ అంచనాకు రావొద్దు. హౌసులో చూసిన దానికంటే మీకు తెలియాల్సింది ఇంకా చాలా ఉంది' అని దీనికి అర్థం. 

ఈ పోస్ట్ బట్టి చూస్తుంటే తన విషయంలో బిగ్‌బాస్ అన్యాయం చేసినట్లు ఈమె ఫీలవుతున్నట్లు తెలుస్తోంది. అందుకే నేరుగా చెప్పలేకు.. ఇలా పరోక్షంగా పోస్ట్ పెట్టి మరీ తన అభిప్రాయాన్ని వెల్లడించింది. కొన్నిరోజులు ఆగితే అసలు ఈ పోస్టుకు అర్థం ఏంటనేది క్లారిటీ వచ్చేస్తుంది.

(ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లోకి ఏకంగా 29 సినిమాలు)

Advertisement
 
Advertisement
Advertisement