వేసవిలో డీజే టిల్లు వస్తున్నాడు  | Sakshi
Sakshi News home page

వేసవిలో డీజే టిల్లు వస్తున్నాడు 

Published Sat, Jan 27 2024 4:06 AM

Siddu Jonnalagada Starrer Tillu Square Gets A New Release Date - Sakshi

వేసవికి థియేటర్స్‌లోకి వచ్చేందుకు సిద్ధం అవుతున్నాడు డీజే టిల్లు. సిద్ధు  జొన్నలగడ్డ హీరోగా నటించిన ‘డీజే టిల్లు’ (2022) మంచి హిట్‌ సాధించింది. ప్రస్తుతం ఈ సినిమా సీక్వెల్‌ ‘డీజే టిల్లు స్క్వేర్‌’తో బిజీగా ఉన్నారు సిద్ధు జొన్నలగడ్డ. సీక్వెల్‌లో అనుపమా పరమేశ్వరన్‌ హీరోయిన్‌. మల్లిక్‌ రామ్‌ దర్శకత్వంలో శ్రీకర స్టూడియోస్‌ సమర్పణలో సితార ఎంటర్‌టైన్‌మెంట్స్‌ బ్యానర్‌పై సూర్యదేవర నాగవంశీ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

కాగా ఈ సినిమాను ఫిబ్రవరి 9న విడుదల చేయాలనుకున్నారు. కొన్ని కారణాల వల్ల  రిలీజ్‌ను మార్చి 29కి వాయిదా వేస్తున్నట్లుగా శుక్రవారం ప్రకటించారు మేకర్స్‌. ‘‘కొన్ని అనుకోని పరిస్థితుల కారణంగా ఫిబ్రవరి 9న అనుకున్న విడుదలను వాయిదా వేస్తున్నాం. వేసవి సెలవులను దృష్టిలో పెట్టుకొని చిత్రాన్ని మార్చి 29న విడుదల చేయాలని నిర్ణయించాం’’ అని చిత్ర యూనిట్‌ పేర్కొంది.

Advertisement
 
Advertisement

తప్పక చదవండి

 
Advertisement