తంగలాన్‌ బ్యూటీ 'మాళవిక మోహనన్‌' బికినీ సాంగ్‌ విడుదల | Siddhant Chaturvedi And Malavika Mohanan Song Out From Yudhra Movie | Sakshi
Sakshi News home page

తంగలాన్‌ బ్యూటీ 'మాళవిక మోహనన్‌' బికినీ సాంగ్‌ విడుదల

Sep 2 2024 5:27 PM | Updated on Sep 2 2024 6:49 PM

Siddhant Chaturvedi And Malavika Mohanan Song Out From Yudhra Movie

సిద్ధాంత్‌ చతుర్వేది- మాళవిక మోహనన్‌ జోడిగా నటించిన చిత్రం 'యుధ్రా'. ఈ సినిమాతో మాళవిక మోహనన్‌ బాలీవుడ్‌లో ఎంట్రీ ఇచ్చింది. భారీ యాక్షన్‌ సినిమా నుంచి తాజాగా సాంగ్‌ను మేకర్స్‌ విడుదల చేశారు. అయితే, ఈపాటలో మాళవిక మోహనన్‌ బికినీతో రొమాన్స్‌ చేసింది.  ఇటీవలే ‘తంగలాన్‌’తో ప్రేక్షకులను మెప్పించిన మాళవిక మోహనన్‌ బాలీవుడ్‌ వెండితెరపై గ్లామర్‌తో  తన సత్తా ఏంటో చూపించనుంది.  'యూధ్రా' నుంచి ఇప్పటికే విడుదలైన ట్రైలర్‌ ప్రేక్షకులను మెప్పిస్తుంది.

‘మామ్‌’ ఫేమ్‌ రవి ఉద్యవార్‌ ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. మరో సరికొత్త పాత్రలో మాళవిక, సిద్ధాంత్‌ ఇందులో కనిపించనున్నారు. ఎక్సెల్ ఎంటర్‌టైన్‌మెంట్‌పై రితేశ్‌ సిధ్వాని, ఫర్హాన్‌ అక్తర్‌ నిర్మించిన ఈ సినిమా సెప్టెంబర్‌ 20న ప్రేక్షకుల ముందుకు రానుంది. ప్రభాస్‌ సరసన 'రాజాసాబ్‌'లో కూడా మాళవిక నటిస్తున్న విషయం తెలిసిందే.

Advertisement
 
Advertisement
Advertisement