'దేవర'లో ఎన్టీఆర్‌కు జోడీగా శ్రుతి మరాఠే.. ఎవరో తెలుసా..? | Shruti Marathe Got Chance To Act With Jr NTR In Devara Movie - Sakshi
Sakshi News home page

'దేవర'లో ఎన్టీఆర్‌కు జోడీగా శ్రుతి మరాఠే.. ఇన్‌స్టాలో వెరీ పాపులర్‌

Feb 10 2024 11:23 AM | Updated on Feb 10 2024 4:15 PM

Shruti Marathe Get Movie Chance With JR NTR - Sakshi

జూ ఎన్టీఆర్‌- జాన్వీ కపూర్‌ జోడీగా దేవర సినిమా యాక్షన్‌ డ్రామాగా తెరకెక్కుతుంది. ఈ చిత్రానికి కొరటాల శివ దర్శకత్వం వహిస్తున్నాడు. సైఫ్‌ అలీఖాన్‌ కీలక పాత్ర పోషిస్తున్న ఈ చిత్రం భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నారు. ఇప్పటికే ఈ చిత్రం నుంచి విడుదలైన గ్లింప్స్‌ విపరీతంగా మెప్పించింది. రెండు భాగాలుగా రానున్న ఈ సినిమాపై ఫ్యాన్స్ కూడా భారీ అంచనాలు పెట్టుకున్నారు.

ఇప్పటికే షూటింగ్‌ వేగంగా జరుపుకుంటున్న దేవర యూనిట్‌లోకి ఒక కొత్త హీరోయిన్‌ చేరినట్లు వార్తలు వస్తున్నాయి. ఈ చిత్రంతో మరాఠీ హీరోయిన్‌ టాలీవుడ్‌కు పరిచయం కాబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి. మరాఠీ బ్యూటీగా భారీ క్రేజ్‌ ఉన్న శ్రుతి మరాటేకు తారక్‌తో ఛాన్స్‌ దక్కిందని దేవరలో ఆమె సెకండ్‌ హీరోయిన్‌గా ఎంపిక అయిందని వార్తలు వస్తున్నాయి.  దేవర చిత్రంలో తారక్‌ డ్యుయల్‌ రోల్‌లో కనిపిస్తాడు.

పాపులర్‌ హీరోయిన్‌ శ్రుతి మరాఠేకు ఛాన్స్‌
ఇప్పటికే జాన్వీ కపూర్‌ ఒక హీరోయిన్‌గా ఉంది. మరి రెండో హీరోయిన్‌ ఎవరు అనే ప్రశ్న వస్తున్న సమయంలో  శ్రుతి మరాఠే పేరు తెరపైకి వచ్చింది. ఆమె మరాఠ, హిందీ చిత్రాల్లో వెరీ పాపులర్‌ హీరోయిన్‌గా గుర్తింపు ఉంది. తారక్‌ ఫ్యాన్స్‌పేజీలలో ఈ వార్త భారీగా వైరల్‌ అవుతుంది. వాటికి శ్రుతి మరాటే కూడా రియాక్ట్‌ అయింది. తారక్‌ అంటే చాలా ఇష్టం అని ఆమె పోస్ట్ చేయడంతో  ఈ వార్త నిజమేనంటూ జోరుగా ప్రచారం జరుగుతుంది.

గుజరాత్‌కు చెందిన శ్రుతి మరాఠే గతేడాదిలో పూణేలో జరిగిన గణపతి నిమజ్జనం సమయంలో కొన్ని గంటల పాటు ఆమె డోలు వాయించింది. అప్పట్లో ఆమె వీడియోలు ఇన్‌స్టాగ్రామ్‌లో విపరీతంగా వైరల్‌ అయ్యాయి. అలా ఆమె దేశవ్యాప్తంగా గుర్తింపు పొందింది. మరి దేవరలో ఆమెకు ఛాన్స్‌ నిజంగానే వస్తే ఇక్కడ మరింత పాపులర్‌ అవడం ఖాయం అని చెప్పవచ్చు. కానీ ఈ విషయంపై చిత్ర యూనిట్‌ నుంచి ఎలాంటి అఫీషియల్‌ ప్రకటన రాలేదు.

ఏప్రిల్ 5న పార్ట్‌ -1 విడుదల అవుతుందని చిత్ర యూనిట్‌ ఇప్పటికే ప్రకటించింది. కానీ అనుకున్న సమయానికి విడుదల కాకపోవచ్చని తెలుస్తోంది. దీనికి ప్రధాన కారణం కొద్దిరోజుల క్రితం సైఫ్ అలీ ఖాన్ గాయపడటంతో షూటింగ్‌ విషయంలో కొంత జాప్యం ఏర్పడింది. అంతే కాకుండా సినిమాకు సంబంధించి వీఎఫ్‌ఎక్స్‌ వర్క్‌ కూడా కొంత పెండింగ్‌లో ఉందని సమాచారం. దీంతో దేవర సినిమా దసరాకు విడుదల కావచ్చని వార్తలు వస్తున్నాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement