పండంటి బిడ్డకు జన్మనిచ్చిన హీరోయిన్.. పోస్ట్ వైరల్ | Shivaleeka Oberoi and Abhishek Pathak have become parents to a baby girl | Sakshi
Sakshi News home page

Shivaleeka Oberoi: తండ్రైన దృశ్యం-2 డైరెక్టర్‌.. సోషల్ మీడియాలో పోస్ట్

Apr 19 2026 1:42 PM | Updated on Apr 19 2026 2:02 PM

Shivaleeka Oberoi and Abhishek Pathak have become parents to a baby girl

ప్రముఖ బాలీవుడ్ నటి శివాలికా ఒబెరాయ్ గుడ్ న్యూస్ చెప్పింది. తాజాగా ఆమె పండంటి బిడ్డకు జన్మనిచ్చింది. తన భర్త, డైరెక్టర్‌ అభిషేక్ పాఠక్‌తో కలిసి ఈ శుభవార్త పంచుకుంది. ఈ విషయాన్ని సోషల్ మీడియా పోస్ట్ చేశారు. మా ఇంటికి చిన్నారి లక్ష్మీ దేవి ఈ శుభ దినాన మా జీవితంలోకి అడుగుపెట్టింది.. ఇది స్వచ్ఛమైన రూపంలో లభించిన ఒక వరం' క్యాప్షన్ ‍రాసుకొచ్చారు. ఈ గుడ్ న్యూస్ తెలుసుకున్న అభిమానులు, పలువురు సెలబ్రిటీలు సోషల్ మీడియాలో శుభాకాంక్షలు చెబుతున్నారు.

కాగా.. శివాలికా తాను గర్భవతి అయిన విషయాన్ని గతేడాది డిసెంబర్‌లో రివీల్ చేసింది.  ఈ విషయాన్ని సోషల్ మీడియాలో పంచుకుంది. నటి శివాలికా, డైరెక్టర్‌ అభిషేక్ పాఠక్ ఫిబ్రవరి 2023లో గోవాలో వివాహం చేసుకున్నారు. 2020లో 'ఖుదా హాఫిజ్' సినిమా నిర్మాణ సమయంలో వీరిద్దరు మొదటిసారి కలుసుకున్నారు. ఈ చిత్రాన్ని అభిషేక్ నిర్మించగా.. శివాలికా హీరోయిన్‌గా నటించారు. ఆ తర్వాత ఈ జంట టర్కీలో నిశ్చితార్థం చేసుకున్నారు. హాట్ ఎయిర్ బెలూన్‌ల మధ్య  శివాలికాకు అభిషేక్ ప్రపోజ్ చేశారు.

కాగా.. కిక్, హౌస్‌ఫుల్-3 చిత్రాలకు సహాయ దర్శకురాలిగా శివాలికా తన కెరీర్ ప్రారంభించింది. ఆ తర్వాత యే సాలీ ఆషికి (2019) చిత్రంతో హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చింది. అనంతరం ఖుదా హఫీజ్ చిత్రంలో తన పాత్రకు గుర్తింపు తెచ్చుకుంది.  ఇక అభిషేక్ పాఠక్ హిందీలో దృశ్యం -2,  ఉజ్డా చమన్ లాంటి చిత్రాలకు దర్శకత్వం వహించారు. అంతే కాకుండా ప్యార్ కా పంచ్‌నామా, ఖుదా హాఫిజ్, సెక్షన్ 375 లాంటి ప్రాజెక్టులను నిర్మాతగా వ్యవహరించారు. 
 

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement