'బిగ్ డాడీ' పేరుతో వచ్చేస్తున్న ఘోస్ట్‌ టీజర్‌ | Shiva Rajkumar Ghost Movie Shivarajkumar Ghost Movie Teaser July 12 | Sakshi
Sakshi News home page

Ghost Movie Teaser: 'బిగ్ డాడీ' పేరుతో వచ్చేస్తున్న ఘోస్ట్‌ టీజర్‌

Jul 9 2023 1:17 PM | Updated on Jul 9 2023 1:18 PM

Shiva Rajkumar Ghost Movie Shivarajkumar Ghost Movie Teaser July 12 - Sakshi

కన్నడ చక్రవర్తి డా శివరాజ్ కుమార్ హీరోగా హై ఓల్టేజ్ యాక్షన్ థ్రిల్లర్‌గా పాన్‌ ఇండియా లెవెల్‌లో రూపొందుతోన్న చిత్రం ఘోస్ట్. కన్నడ బీర్బల్ వంటి బ్లాక్ బస్టర్ చిత్రాలు రూపొందించి తనకంటూ ప్రత్యేకమైన స్థానం సంపాదించుకున్న దర్శకుడు శ్రీనినే ఈ ఘోస్ట్ చిత్రానికి దర్శకుడు. ప్రముఖ రాజకీయనాయకుడు, నిర్మాత సందేశ్ నాగరాజ్ తన 'సందేశ్ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై' ఘోస్ట్ చిత్రాన్ని ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు.  

(ఇదీ చదవండి: చెప్పు తెగుతుందంటూ.. రిపోర్టర్‌పై బేబమ్మ రియాక్షన్‌)

యాక్షన్ థ్రిల్లర్‌గా తెరకెక్కిన ఘోస్ట్ ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు చివరి దశలో ఉన్నాయి. ఘోస్ట్ టీజర్‌ను బిగ్ డాడీ పేరుతో జూలై 12 న విడుదల చేయనున్నారు. బిగ్ డాడీ అనౌన్స్మెంట్‌ను స్ట్రైకింగ్ పోస్టర్‌తో ప్రకటించారు. శివరాజ్ కుమార్ గన్‌తో సీరియస్ లుక్‌తో వచ్చిన పోస్టర్ ఆకట్టుకుంటోంది.

 ‘ఘోస్ట్’ చిత్రానికి టాప్ టెక్నిషియన్స్ పని చేస్తున్నారు. మస్తీ, ప్రసన్న వి ఎం డైలాగ్స్ రాస్తున్నారు. కేజీఎఫ్‌తో  దేశవ్యాప్తంగా  గుర్తింపు తెచ్చుకున్న ఆర్ట్ డైరెక్టర్ శివకుమార్ ఈ సినిమాకు పనిచేస్తున్నారు. పాపులర్ మ్యూజిక్ డైరెక్టర్ అర్జున్ జన్య సంగీతాన్ని అందిస్తున్నారు. 

(ఇదీ చదవండి: ఆ యాడ్‌ చేస్తే.. రూ. కోట్లలో ఇస్తామన్నారు: స్మృతి ఇరానీ)

Advertisement
 
Advertisement
Advertisement