
మనసుకు నచ్చినవారు దూరమైతే తట్టుకోలేం. అందులోనూ కన్నవారు ఒకరివెంట మరొకరు మనల్ని వీడి వదిలి వెళ్లిపోతే ఆ బాధను భరించలేము. కానీ, అంతకు మించిన బాధనే భరించాల్సి వచ్చింది సూపర్ స్టార్ మహేశ్‌బాబు (Mahesh Babu)కు! 2022 జనవరిలో మహేశ్ సోదరుడు రమేశ్ బాబు అనారోగ్యంతో కన్నుమూశారు. అదే ఏడాది సెప్టెంబర్‌లో తల్లి ఇందిరా దేవి, నవంబర్‌లో తండ్రి కృష్ణ చనిపోయారు. ఒక్క ఏడాదిలోనే ముగ్గురిని కోల్పోయి తీవ్ర బాధలో కూరుకుపోయాడు.
ఎన్నో కష్టాలు
ఆ విషయాన్ని మహేశ్ మరదలు, ఒకప్పటి హీరోయిన్ శిల్ప శిరోద్కర్ గుర్తు చేసుకుంది. తాజాగా ఆమె ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. ఈ ప్రపంచంలో నాకు తెలిసిన అత్యుత్తమ మానవుల్లో మహేశ్ బావ ఒకరు. ఫ్యామిలీ కోసం ధృడంగా నిలబడతాడు. కానీ, తను చాలా కష్టాలు చూశాడు. కుటుంబాన్ని (తల్లిదండ్రులు, సోదరుడు)ని కోల్పోయి పుట్టెడు దుఃఖంలో ఉన్నప్పటికీ తనను అభిమానించేవారికోసం చిరునవ్వుతో కనిపించేవాడు. మా పేరెంట్స్‌ను కోల్పోయినప్పుడు అక్కకు మహేశ్, నాకు నా భర్త అండగా నిలబడి ఓదార్చారు. వీళ్లిద్దరూ మాకోసం ఎంతో చేశారు అని చెప్పుకొచ్చింది.
తనకు చంటిబిడ్డనయ్యా
నమ్రత గురించి మాట్లాడుతూ.. నమ్రత నాకంటే పెద్దది. కానీ సినిమాల్లోకి నేనే ముందు వచ్చాను, నాకే ఫస్ట్ పెళ్లయింది, నాకే ముందు పాప పుట్టింది. దీంతో అందరూ నన్నే పెద్దదాన్ని అనుకుంటారు. నాకు పెళ్లయ్యాకే నమ్రతకు మరింత క్లోజయ్యాను. మా పేరెంట్స్ చనిపోయాక నేను తనకు చంటిబిడ్డగా మారిపోయాను. తన కన్నబిడ్డల కంటే నా గురించే ఎక్కువ టెన్షన్ పడుతూ ఉంటుంది. అక్క నాపై అంత ప్రేమ చూపిస్తుంది అని శిల్ప శిరోద్కర్ చెప్పుకొచ్చింది.
చదవండి: కాస్టింగ్ కౌచ్.. అసహ్యంతో ఇండస్ట్రీని వదిలేద్దామనుకున్నా