ప్రేమలో ప్రతిసారీ నేనే మోసపోయాను: యంగ్ హీరోయిన్ | Shehnaaz Gill Comments Love Relationship | Sakshi
Sakshi News home page

Shehnaaz Gill: నన్ను అందరూ మోసం చేశారు.. హీరోయిన్ ఆవేదన

Jul 4 2023 4:10 PM | Updated on Jul 4 2023 4:26 PM

Shehnaaz Gill Comments Love Relationship - Sakshi

దాదాపు హీరోయిన్లు ఎవరైనా సరే తమ జీవితంలోని ప్రేమ, రిలేషన్‌షిప్ గురించి మాట్లాడటానికి పెద్దగా ఇష్టపడరు. కొన్నిసార్లు మాత్రం సందర్భాన్ని బట్టి బయటపడుతుంటారు. అలా ఇప్పుడు బాలీవుడ్ నటి షెహనాజ్ గిల్.. తన ప్రేమ, బ్రేకప్స్ గురించి రివీల్ చేసింది. తను ఎవరినీ మోసం చేయలేదని, ప్రతిసారీ తనే మోసపోయాననే విషయాన్ని బయటపెట్టింది.

పంజాబీ నటి అయిన షెహనాజ్ గిల్.. సొంత భాషలో పలు సినిమాల్లో హీరోయిన్ గా చేసింది. బాలీవుడ్ నటుడు సిద్ధార్థ్ శుక్లాతో రిలేషన్‌లో ఉంది. బిగ్‌బాస్‌లో ఈ జోడీ అప్పట్లో చాలా పాపులర్. కానీ సిద్ధార్థ్ అకస్మాత్తుగా గుండెపోటు రావడంతో చనిపోయాడు. దీంతో షెహనాజ్ డిప్రెషన్ లోకి వెళ్లిపోయింది. కొన్నాళ్లకు కుదుటపడి సినిమాలు, ఆల్బమ్ సాంగ్స్ చేస్తూ కాస్త బిజీగా ఉంది. తాజాగా షెహనాజ్ నటించిన ఓ ఆల‍్బమ్ సాంగ్ విడుదలైంది. ఈ సందర్భంగానే తన బ్రేకప్స్ గురించి మాట్లాడింది. 

'నేను ఎవరినీ ప్రేమ విషయమై మోసం చేయలేదు. కానీ నన‍్నే చాలాసార్లు మోసం చేశారు. ఈ రోజుల్లో నేను నమ్మేది ఒక్కటే. బ్రేకప్ చెప్పి, దూరంగా వెళ్లిపోవాలనుకుంటే వెళ్లిపోండి' అని నటి షెహనాజ్ గిల్ ఆవేదన వ్యక‍్తం చేసింది. అయితే తాను పూర్తిగా రిలేషన్‌షిప్‌కు దూరం కాలేదని, నిజమైన ప్రేమ దొరికితే మాత్రం అస్సలు విడిచిపెట్టనని క్లారిటీ ఇచ్చింది. 

(ఇదీ చదవండి: మహేశ్‌నే మించిపోయిన సితార.. ఆ ఒక్క విషయంలో)

Advertisement
 
Advertisement
Advertisement