Sithara's New Jewellery Ad Launched At New Tork Times Square - Sakshi
Sakshi News home page

Sithara New Ad: టీనేజ్‌లోకే రాలేదు.. కానీ పాన్ వరల్డ్ రేంజులో!

Jul 4 2023 1:03 PM | Updated on Jul 4 2023 1:52 PM

Sithara New Advertisement Video Times Square New York - Sakshi

సూపర్‌స్టార్ మహేశ్‌బాబు ఫుల్ హ్యాపీ. ఓ పక్క సినిమాలు, యాడ్స్ చేస్తూ రెండు చేతులా సంపాదిస‍్తూ బిజీగా ఉన్నాడు. ఇప్పుడు అతడికి పోటీగా కూతురు సితార కూడా వచ్చేసింది. తన అంతా హైట్ పెరిగిపోయిందని ఆశ్చర్యపడేలోపే.. మరో షాక్ ఇచ్చి మహేశ్‌నే అవాక్కయ్యేలా చేసినట్లు కనిపిస్తుంది. ఎందుకంటే ఏకంగా పాన్ వరల్డ్ రేంజులో ఎంట్రీ ఇచ్చింది. 

సితార గ్రాండ్ ఎంట్రీ!
మహేశ్ కూతురు సితారని చిన్నప్పటి నుంచి చూస్తున్నాం. ఎప్పటికప్పుడు మహేశ్, నమ్రత షేర్ చేసే ఫొటోలు, వీడియోల వల్ల సితార ఎలా ఉంది, ఏం చేస్తుందనేది తెలుస్తూనే ఉంది. ఇక సితార డ్యాన్స్ వీడియోలైతే ఎప్పటికప్పుడు వైరల్ అవుతూనే ఉంటాయి. ఇదంతా కాదన్నట్లు రీసెంట్ గా ఓ జ్యూవెల్లరీ యాడ్ షూట్‌లో సితార తొలిసారి పాల్గొంది. ఇప్పుడు దాన్ని న్యూయార్క్ టైమ్ స్క్వేర్ లో ప్రదర్శించారు.

(ఇదీ చదవండి: పాయల్ కొత్త సినిమా టీజర్.. అలాంటి సీన్స్‌తో!)

పాన్ వరల్డ్ రేంజులో
ఓ నెలరోజుల క్రితం జరిగిన ఈ యాడ్ షూట్ లో సితార పాల్గొనడం ఓ విధంగా రికార్డ్. ఎందుకంటే టీనేజ్ లోకి రాకముందే ఇలా మోడల్ గా కెరీర్ మొదలుపెట్టిందని తెలియగానే అభిమానులు చాలా సంతోషపడ్డారు. ఇప్పుడు ఏకంగా దాన్ని అమెరికాలోని ప్రఖ్యాత టైమ్ స్కేర్వ్ లో ప్రదర్శించారనేసరికి సోషల్ మీడియాలో ఆ ఫొటోలు, వీడియోలని వైరల్ చేస్తున్నారు. 

యాక్టర్ అవుతుందా?
డ్యాన్సర్‌గా అద్భుతమైన ప్రతిభ చూపిస్తున్న సితార.. ఇప్పుడు యాడ్ షూట్స్ లోకి కూడా వచ్చేసింది. తండ్రి ఇక్కడ యాడ్స్ చేస్తుంటే.. సితార మాత్రం అమెరికా నుంచి మొదలుపెట్టింది. మరి తండ్రి అడుగుజాడల్లోనే నటిగా అరంగేట్రం వస్తుందా లేదంటే కేవలం యాడ్స్, డ్యాన్స్ వరకే పరిమితం అవుతుందా అనేది చూడాలి.


(ఇదీ చదవండి: సమంత మళ్లీ ప్రేమలో పడిందా? ఆ పోస్ట్‌ అర్థమేంటి?)

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement