Payal Rajput's Mangalavaaram Teaser Is Out Now! - Sakshi
Sakshi News home page

Mangalavaaram Teaser: ఈసారి ఏదో గట్టిగా ప్లాన్ చేశారు భయ్యా!

Jul 4 2023 12:05 PM | Updated on Jul 4 2023 12:29 PM

Mangalavaaram Teaser Payal Rajput - Sakshi

'ఆర్ఎక్స్ 100' తర్వాత పాయల్ రాజ్‌పుత్, దర్శకుడు అజయ్ భూపతి కలిసి చేస్తున్న సినిమా 'మంగళవారం'. గ్రామీణ నేపథ్య కథతో తీస్తున్న ఈ సినిమా షూటింగ్ ఇప్పటికే పూర్తయింది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ జరుగుతోంది. ఈ క్రమంలోనే తాజాగా టీజర్ ని రిలీజ్ చేశారు. ఒకటిరెండు డైలాగ్స్ మాత్రమే ఉన్నప్పటికీ సమ్‌థింగ్ డిఫరెంట్ అనేలా ఉంది.

ఈ టీజర్ లో చాలా క్యారెక్టర్స్ ని చూపించారు. వాళ్లందరూ ఆకాశంలో ఏదో వింతను చూస్తున్నట్లు ఉన్న సీన్స్ మాత్రమే చూపించారు. చివర్లో పాయల్ అరుస్తున్న సన్నివేశం, నగ్నంగా ఉన్న సీన్స్ అయితే 'మంగళవారం'పై ఆసక్తిని పెంచుతున్నాయి. 'కాంతార' ఫేమ్ అజనీష్ లోక్‌నాథ్ బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ అయితే మేజర్ హైలెట్ గా నిలిచింది. విడుదల తేదీ ప్రకటించలేదు గానీ ఇదేదో బాక్సాఫీస్ దగ్గర గట్టిగానే వర్కౌట్ అయ్యేలా కనిపిస్తోంది.  

(ఇదీ చదవండి: సమంత మళ్లీ ప్రేమలో పడిందా? ఆ పోస్ట్‌ అర్థమేంటి?)

Advertisement
 
Advertisement
Advertisement