
ఇరవై ఎకరాల్లో శర్వానంద్ (Sharwanand) ‘భోగి’ ఆరంభించారు. శర్వానంద్ హీరోగా సంపత్ నంది దర్శకత్వంలో కేకే రాధామోహన్ నిర్మిస్తున్న చిత్రానికి ‘భోగి’ (Bhogi Movie) టైటిల్ ఖరారైంది. ఈ రూరల్ బ్యాక్‌డ్రాప్ పీరియాడికల్ యాక్షన్ సినిమాలో అనుపమ పరమేశ్వరన్ (Anupama Parameswaran) హీరోయిన్‌గా నటిస్తుండగా మరో హీరోయిన్ డింపుల్ హయతి (Dimple Hayathi) ఓ లీడ్ రోల్ చేస్తున్నారు. కాగా ‘ఫస్ట్ స్పార్క్’ అంటూ ఈ సినిమా కాన్సెప్ట్ వీడియోను విడుదల చేసి, ఈ సినిమాకు ‘భోగి’ టైటిల్‌ను ఫిక్స్ చేసినట్లుగా, బుధవారం నుంచి ఈ సినిమా చిత్రీకరణ మొదలైనట్లుగా యూనిట్ వెల్లడించింది.
‘‘1960 నేపథ్యంలో ఉత్తర తెలంగాణ–మహారాష్ట్రల ప్రాంతంలో వింటేజ్ సెట్టింగ్‌తో ‘భోగి’ సినిమా అద్భుతంగా ఉంటుంది. ప్రొడక్షన్ టీమ్ ఆరు నెలలు కష్టపడి, దాదాపు 20 ఎకరాల్లో భారీ సెట్ వేశారు. విధి, పోరాటం, మార్పు, తిరుగుబాటు అంశాల మేళవింపుతో ఈ సినిమా కథనం ఉంటుంది. తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో ఈ సినిమాను రిలీజ్ చేస్తాం. ఈ సినిమాకు కిరణ్ కుమార్ మన్నె ఆర్ట్ డైరెక్టర్‌గా చేస్తున్నారు’’ అని చిత్రబృందం పేర్కొంది.
చదవండి: శివయ్యా...' హర్టయిన కన్నప్ప టీమ్.. సారీ చెప్పిన శ్రీవిష్ణు