గంగ యాక్షన్‌ | Sharwanand Bhogi unit begins filming climax sequence | Sakshi
Sakshi News home page

గంగ యాక్షన్‌

Jun 13 2026 3:10 AM | Updated on Jun 13 2026 3:10 AM

Sharwanand Bhogi unit begins filming climax sequence

విలన్స్‌ను రఫ్ఫాడిస్తున్నాడు గంగ. ఏ రేంజ్‌లో, ఏ స్టైల్లో అనేది ‘భోగి’ సినిమాలో చూడాలి. శర్వానంద్‌ హీరోగా సంపత్‌ నంది దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం ‘భోగి’. ఈ చిత్రంలో గంగ పాత్రలో శర్వానంద్, కందుల సులోచనా రాణిగా అనుపమా పరమేశ్వరన్, మందారంగా డింపుల్‌ హయాతి నటిస్తున్నారు. 1960ల నేపథ్యంలో తెలంగాణ – మహారాష్ట్ర సరిహద్దులోని ఒక కల్పిత గ్రామంలో ఈ సినిమా కథనం సాగుతుంది.

ప్రస్తుతం ఈ సినిమాకు సంబంధించిన ఒక ఎమోషనల్‌ క్లైమాక్స్‌ సీక్వెన్స్‌ను చిత్రీకరిస్తున్నారు. ‘‘ఆర్ట్‌ డైరెక్టర్‌ కిరణ్‌ కుమార్‌ మన్నె నిర్మించిన భారీ సెట్‌లో ఈ ఎమోషనల్‌ యాక్షన్‌ క్లైమాక్స్‌ చిత్రీకరణ జరుగుతోంది. శర్వా రిస్కీ స్టంట్లతో తన నటనలోని సరికొత్త కోణాన్ని చూపించనున్నారు.

దిలీప్‌ సుబ్బరాయన్‌ యాక్షన్‌ సీక్వెన్స్‌ను డిజైన్‌ చేశారు. క్లైమాక్స్‌ చిత్రీకరణ షెడ్యూల్‌ దాదాపు 20 రోజులపాటు సాగుతుంది’’ అని యూనిట్‌ పేర్కొంది. లక్ష్మి రాధామోహన్‌ సమర్పణలో కేకే రాధామోహన్‌ నిర్మిస్తున్న ఈ సినిమా తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో ఆగస్టు 28న విడుదల కానుంది.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement