
తాజాగా షణ్ముఖ్ ఓ కొత్త కారు కొన్నాడు. దాని ముందు నిల్చున్న ఫొటోను షేర్ చేస్తూ.. 'ఇది నేను హై, ఇది నా కొత్త కారు హై, ఇంకా పార్టీలు లేవు హై..
Shanmukh Jaswanth New Car: షణ్ముఖ్ జస్వంత్.. యూట్యూబ్ వీక్షకులకు, మరీ ముఖ్యంగా యూత్‌కు బాగా సుపరిచితమీ పేరు. యూట్యూబ్ వీడియోలతో బాగా ఫేమస్ అయిన జస్వంత్ అప్పుడప్పుడూ బుల్లితెర మీద ప్రసారమయ్యే స్పెషల్ ఈవెంట్లలోనూ పాల్గొంటూ తన డ్యాన్స్‌తో అదరగొడుతున్నాడు. బిగ్‌బాస్ మాజీ కంటెస్టెంట్ దీప్తి సునయనతో ప్రేమాయణం కూడా అతడికి మరింత పాపులారిటీ తెచ్చిపెట్టింది.
ఇదిలా వుంటే ఆ మధ్య షణ్ముఖ్ మద్యం సేవించి కారు నడపడం, ఆ కేసుకు సంబంధించిన వీడియోలు నెట్టింట్లో ప్రత్యక్షం కావడంతో అతడి ఇమేజ్ డ్యామేజ్ అయింది. కానీ అతడు నటించిన సూర్య వెబ్‌సిరీస్ హిట్ టాక్ తెచ్చుకోవడంతో అందరూ ఆ ఘటనను మర్చిపోయారు. కానీ ఆ ఘటన నుంచి షణ్ముఖ్ గుణపాఠం నేర్చుకున్నట్లు తెలుస్తోంది. కొన్ని సందర్భాల్లో తాను కారు నడపకపోతేనే మంచిది అని ఓ నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది.
తాజాగా షణ్ముఖ్ ఓ కొత్త కారు కొన్నాడు. దాని ముందు నిల్చున్న ఫొటోను షేర్ చేస్తూ.. 'ఇది నేను హై, ఇది నా కొత్త కారు హై, ఇంకా పార్టీలు లేవు హై, త్వరలో డ్రైవర్‌ను కూడా పెట్టుకుంటా హై' అని రాసుకొచ్చాడు. అంటే మరోసారి ఎలాంటి ప్రమాదాలు చోటు చేసుకోకుండా ముందు జాగ్రత్తగా అతడు తన కారుకు డ్రైవర్‌ను పెట్టుకుంటున్నాడని నెటిజన్లు అంటున్నారు. ఇక ఈ కారును తన సొంతం చేసుకోవడానికి ఈ యూట్యూబ్ స్టార్ సుమారు రూ.15 లక్షలు వెచ్చించినట్లు తెలుస్తోంది.