ప్రేమలో ఉన్నాను..కానీ పెళ్లి చేసుకునే ఉద్దేశం లేదు : షకీలా | Sakshi
Sakshi News home page

'తను బ్యాచిలర్‌, నాకంటే చిన్నవాడు..ఏజ్‌ జస్ట్‌ నెంబర్‌ మాత్రమే'

Published Wed, May 5 2021 8:18 PM

Shakeela Reveals About Her Boy Friend  - Sakshi

పలు భాషల్లో 200 పైగా చిత్రాల్లో నటించి శృంగార తారగా ప్రేక్షకులను అలరించిన నటి షకీలా. ఒకానొక దశలో స్టార్‌ హీరోలకు సమానంగా పాపులారిటీని సంపాదించుకున్నారు. అయితే ష‌కీలా సినిమా కెరీర్‌లోనే కాదు వ్య‌క్తిగ‌త జీవితంలోనూ ప‌లు ఒడిదుడుగులు చవి చూశారు. త‌న‌ను అర్థం చేసుకునే వాడు దొర‌క‌క‌పోవడంతో.. ఇప్ప‌టికీ పెళ్లి చేసుకోలేదని పలు సార్లు చెప్పారు షకీలా. తాజాగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడిన ఆమె తాను ప్రస్తుతం ఒకరితో ప్రేమలో ఉన్నట్లు వెల్లడించింది. గతంలోనూ తనకు బాయ్‌ ప్రెండ్స్‌ చాలామందే ఉన్నారని, అయితే వాళ్లు అందరూ ఒక్కొక్కరిగా వదిలేసి వెళ్లిపోయారని పేర్కొంది.

'ప్రస్తుతం నేను ఒకరితో లవ్‌లో ఉన్నా. తనకి కూడా నేనంటే చాలా ఇష్టం. లవ్‌ అంటే లవ్‌ అంతే. ఇప్పటికే 43 ఏళ్లు వచ్చాయి. ఇక పెళ్లి చేసుకునే ఉద్దేశం లేదు. ఇప్పటివరకు ఏడుగురితో రిలేషన్‌లో ఉన్నా. ఈ వయసులో లవ్‌ ఏంటి అని అనుకోవాల్సిన పని లేదు. నాకు 43. అతనికి 30 తను నాకంటే చిన్నవాడు. కానీ ఏజ్‌ అనేది జస్ట్‌ నెంబర్‌ మాత్రమే. అయినా నేను పెళ్లైన వ్యక్తితో లవ్‌లో లేను కదా అతని ఫ్యామిలీని డిస్ర్టబ్‌ చేయడానికి. ఇద్దరం ప్రేమించుకుంటున్నాం. ఇందులో తప్పేం ఉంది' అంటూ బోల్డ్‌ కామెంట్స్‌ చేశారు. అంతేకాకుండా ఎవరితోనూ సీక్రెట్‌ రిలేషన్‌ పెట్టుకోవడం లేదని, ఒకరితో విడిపోయిన తర్వాతే మరొకరితో రిలేషన్‌ షిప్‌ పెట్టుకున్నాని పేర్కొంది.

ఇక గతంలో త‌మిళంలో ప్రసారమయ్యే ఓ షోలో పాల్గొన్న షకీలా..తన కూతురిని పరిచయం చేసి షాక్‌ ఇచ్చిన సంగతి తెలిసిందే. మిల్లా నా కుమార్తె అంటూ ఓ యువతిని పరిచయం చేశారు. అయితే మిల్లా ట్రాన్స్‌జెండర్‌ అని, చాలా ఏళ్ల క్రితమే తనను దత్తత తీసుకున్నట్లు వెల్లడించిన సంగతి తెలిసిందే. ఆమె ప్రస్తుతం డిజైనర్‌గా పని చేస్తున్నట్లు తెలిపింది. ఇక ఇటీవలె షకీలా బయోపిక్‌ విడుదలైన సంగతి తెలిసిందే. ఇంద్రజిత్‌ లంకేష్‌ దర్శకత్వం వహించిన ఈ చిత్రం ఐదు భాషల్లో రిలీజైంది. 

చదవండి : కుమార్తెని పరిచయం చేసి షాకిచ్చిన షకీలా
షణ్ముఖ్‌తో దీప్తి సునయన.. అక్కడేం చేస్తుంది?

Advertisement
 
Advertisement