కుమార్తెని పరిచయం చేసి షాకిచ్చిన షకీలా

Shakeela Opens up About her Transgender Daughter For The First Time - Sakshi

షకీలా’ ఈ పేరుకు ఒకప్పుడు ఇండస్ట్రీలో యమ క్రేజ్‌. స్టార్‌ హీరోలకు సైతం దక్కని పాపులారిటీని సొంతం చేసుకున్నారు షకీలా. ఆ త‌రువాత ఉన్న‌ట్లుండి కెరీర్లో ఢీలా ప‌డ్డారు. కార‌ణం ఏదైనా ఆ త‌రువాత మాత్రం చిన్న చిన్న పాత్ర‌ల‌కు మాత్ర‌మే ప‌రిమితం అయ్యారు. కాగా ష‌కీలా సినిమా కెరీర్‌లోనే కాదు వ్య‌క్తిగ‌త జీవితంలోనూ ప‌లు ఒడిదుడుగులు చవి చూశారు. త‌న‌ను అర్థం చేసుకునే వాడు దొర‌క‌క‌పోవడంతో.. ఇప్ప‌టికీ పెళ్లి చేసుకోలేదు ష‌కీలా. ఇదంతా ప‌క్క‌న‌పెడితే గత కొద్ది రోజులుగా తెరకు దూరంగా ఉన్న షకీలా ఇటీవల మ‌ళ్లీ లైమ్‌లైట్‌లోకి వ‌చ్చారు. త‌మిళ బుల్లితెర‌పై ప్ర‌సార‌మ‌వుతున్న ‘కుకు విత్ కోమ‌లి’లో కంటెస్టెంట్‌గా పాల్గొన్న ష‌కీలా.. ఈ సీజ‌న్ విన్న‌ర్‌గా నిలిచే అవకాశాలు ఉన్న‌ట్లు తెలుస్తోంది. 

ఇక ఓ రోజు ఈ షోలో తన కుమార్తెని పరిచయం చేసి కంటెస్టెంట్లకు, ప్రేక్షకులకు షాక్‌ ఇచ్చారు షకీలా. మిల్లా నా కుమార్తె అంటూ షకీలా ఓ యువతిని పరిచయం చేశారు. ఇది చూసి కంటెస్టెంట్లతో పాటు ప్రేక్షకులు కూడా షాక్‌ తిన్నారు. అసలు షకీలా వివాహం ఎప్పుడు చేసుకున్నారని ఆలోచించడం ప్రారభించారు. ఈ ప్రశ్నలకు షకీలా సమాధానం ఇచ్చారు. మిల్లా తన సొంత కుమార్తె కాదని.. చాలా ఏళ్ల క్రితమే తనను దత్తత తీసుకున్నానని తెలిపారు. మరో షాకింగ్‌ విషయం ఏంటంటే మిల్లా ట్రాన్స్‌జెండర్. కుమార్తెని పరిచయం చేస్తూ షకీలా భావోద్వేగానికి గురయ్యారు. 

‘‘మిల్లా చిన్న‌ప్పుడే నేను తనని ద‌త్త‌త తీసుకున్నాను. ఆమెను నా సొంత కూతురిలా పెంచుకున్నాను. క‌ష్ట‌కాలంలో నాకు మిల్లా చాలా స‌పోర్ట్ చేసింది. నేను కూడా ఆమెకు చాలా స‌పోర్ట్ ఇచ్చా. నేనంటే ఆమెకు ఎంతో ప్రేమ’’ అన్నారు. కాగా మిల్లా కాస్ట్యూమ్ డిజైన‌ర్‌గా బిజీగా గ‌డుపుతున్నారు. అలగే మోడ‌ల్‌గా ప్ర‌య‌త్నిస్తున్నారు.

చదవండి:

కఠిన ప్రపంచపు కరుకు అనుభవాల ఆమె కథ

మాతృత్వం కోసం తన వీర్యాన్ని దాచుకున్న ‘దయారా’

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి 

Read also in:
Back to Top