Shah Rukh Khan Spotted Visiting Vaishno Devi Temple Goes Viral - Sakshi
Sakshi News home page

Shah Rukh Khan : వైష్ణోదేవి ఆలయాన్ని సందర్శించిన షారుక్‌ ఖాన్‌, వీడియో వైరల్‌

Dec 12 2022 4:53 PM | Updated on Dec 12 2022 5:24 PM

Shah Rukh Khan Spotted Visiting Vaishno Devi Temple - Sakshi

బాలీవుడ్‌ బాద్‌షా షారుక్‌ ఖాన్‌ తాజాగా జమ్మూ కశ్మీర్‌లోని వైష్ణోదేవి ఆలయాన్ని సందర్శించాడు. ఈ సందర్భంగా అక్కడ ప్రత్యేక పూజలు చేశాడు. దీనికి సంబంధించిన ఫోటోలు, వీడియోలు ప్రస్తుతం నెట్టింట చక్కర్లు కొడుతున్నాయి. ఇటీవలె షారక్‌ మక్కాను సందర్శించి అక్కడ కూడా ప్రత్యేక పూజలు నిర్వహించిన సంగతి తెలిసిందే.

కాగా ప్రస్తుతం షారుక్‌ పఠాన్‌ సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే. సిద్ధార్థ్‌ ఆనంద్‌ తెరకెక్కిస్తున్న ఈ చిత్రాన్ని యశ్‌రాజ్‌ ఫిల్మ్స్‌ సంస్థ నిర్మిస్తోంది. ఇందులో దీపికా పదుకోణె హీరోయిన్‌గా నటిస్తుంది. ఈ చిత్రం వచ్చే ఏడాది జనవరి 25న ప్రేక్షకుల ముందుకు రానుంది. 

Advertisement
 
Advertisement
Advertisement