జీరో టు హీరో అయ్యే ఓ అబ్బాయి కథే ‘సోలో బాయ్‌’: నిర్మాత సతీష్‌ | Seven Hills Satish Talks About Solo Boy Movie | Sakshi
Sakshi News home page

జీరో టు హీరో అయ్యే ఓ అబ్బాయి కథే ‘సోలో బాయ్‌’: నిర్మాత సతీష్‌

Oct 23 2024 12:59 PM | Updated on Oct 23 2024 1:09 PM

Seven Hills Satish Talks About Solo Boy Movie

‘‘కంటెంట్‌ ఉన్న సినిమాలను తెలుగు ప్రేక్షకులు ఎప్పుడూ ఆదరిస్తుంటారు. గతంలో నేను తీసిన ‘బట్టల రామస్వామి బయోపిక్, అందరి బంధువయా’ సినిమాలకు ప్రేక్షకుల ఆదరణ దక్కింది. త్వరలోనే ‘కాఫీ విత్‌ ఏ కిల్లర్, సోలో బాయ్‌’ సినిమాల విడుదలను ప్లాన్‌ చేస్తున్నాం. ఈ చిత్రాలూ ప్రేక్షకులను అలరిస్తాయనే నమ్మకం ఉంది’’ అని తెలిపారు నిర్మాత ‘సెవెన్‌ హిల్స్‌’ సతీష్‌. బుధవారం (అక్టోబరు 23) ఆయన బర్త్‌ డే. 

ఈ సందర్భంగా మంగళవారం సతీష్‌ మాట్లాడుతూ– ‘‘క్రైమ్‌ థ్రిల్లర్‌గా రానున్న ‘కాఫీ విత్‌ ఏ కిల్లర్‌’ సినిమాకు ఆర్పీ పట్నాయక్‌గారు దర్శకత్వం వహించారు. ఇక జీరో నుంచి హీరో అయ్యే ఓ అబ్బాయి కథగా ‘సోలో బాయ్‌’ సినిమా ఉంటుంది. ఇందులో గౌతమ్‌ కృష్ణ హీరోగా నటించారు. శ్వేతా అవస్తి, రమ్య పసుపులేటి హీరోయిన్లుగా నటించారు. త్వరలోనే రిలీజ్‌ డేట్‌ ప్రక టిస్తాం’’ అని తెలిపారు.

Advertisement
 
Advertisement
Advertisement