breaking news
Solo Boy Movie
-
‘సోలో బాయ్’ మూవీ రివ్యూ
టైటిల్: సోలో బాయ్నటీనటులు: గౌతమ్ కృష్ణ, శ్వేతా అవస్థి, రమ్య పసుపులేటి, పోసాని కృష్ణ మురళి, అనితా చౌదరి, షఫీ, ఆర్కే మామ, భద్రమ్, ఆనంద్ చక్రపాణి, సూర్య, ల్యాబ్ శరత్, అరుణ్ కుమార్, రజినీ వర్మ తదితరులునిర్మాణ సంస్థ : సెవెన్ హిల్స్ ప్రొడక్షన్స్నిర్మాత : సెవెన్ హిల్స్ సతీష్ కుమార్దర్శకత్వం : పి. నవీన్ కుమార్సంగీతం: జుడా సాండీసినిమాటోగ్రఫీ:త్రిలోక్ సిద్ధువిడుదల తేది: జులై 4, 2025బిగ్‌బాస్ షోతో తెలుగు ప్రేక్షకులకు బాగా దగ్గరయ్యాడు గౌతమ్ కృష్ణ. అంతకు ముందు హీరోగా ఒకటి రెండు సినిమాల్లో నటించినా..అంతగా గుర్తింపు రాలేదు కానీ, బిగ్‌బాస్‌లోకి వచ్చిన తర్వాత ఫేమస్ అయ్యాడు. ఈ యంగ్ హీరో నటించిన తాజా చిత్రం ‘సోలో బాయ్’. రమ్య పసుపులేటి, శ్వేత అవస్తి హీరోయిన్స్ గా నటించారు. ఈ సినిమా ఎప్పుడో రిలీజ్ కావాల్సింది. కానీ అనివార్య కారణాల వల్ల వాయిదా పడుతూ..ఎట్టకేలకు నేడు(జులై 4) ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మరి ఈ చిత్రం ఎలా ఉందో రివ్యూలో చూద్దాం.సోలో బాయ్ కథేంటంటే..?కృష్ణమూర్తి (గౌతమ్ కృష్ణ) మిడిల్ క్లాస్ యువకుడు. తల్లిదండ్రులు (పోసాని కృష్ణ మురళి, అనితా చౌదరి) అతన్ని ఉన్నంతలో అల్లారు ముద్దుగా పెంచుతాడు. ఇంజనీరింగ్ కాలేజీలో ప్రియ(రమ్య పసుపులేటి)తో ప్రేమలో పడతాడు. ఉద్యోగం వచ్చాక..పెళ్లి చేసుకుందామని ప్రియని అడగ్గా.. ‘నా డ్రైవర్‌కి కూడా నీ కంటే ఎక్కువ జీతం వస్తుంది’ అని అవమానించి బ్రేకప్ చెబుతుంది. ఆ బాధతో కృష్ణమూర్తి తాగుడుకు బానిసైపోతాడు. తండ్రి ప్రోత్సాహంతో మళ్లీ మాములు మనిషిగా మారి ఉద్యోగంలో చేరిన కృష్ణమూర్తి జీవితంలోకి శ్రుతి(శ్వేత అవస్తి) అనే అమ్మాయి వస్తుంది. ఆమెను ప్రేమించి పెళ్లి చేసుకుంటాడు. జీవితం సాఫీగా సాగుతుందన్న సమయంలో తండ్రి మరణిస్తాడు. అదే సమయంలో ఆర్థిక పరిస్థితుల కారణంగా భార్య శ్రుతి విడాకులు ఇస్తుంది. ఒకవైపు తండ్రి మరణం, మరోవైపు భార్య విడాకులు.. వీటన్నింటిని తట్టుకొని కృష్ణ మూర్తి మిలియనీర్‌గా ఎలా ఎదిగాడు? అనేదే సోలోబాయ్ కథ.విశ్లేషణఓ మధ్యతరగతి యువకుడి సక్సెస్ స్టోరీ ఇది. చేతిలో రూపాయి కూడా లేని ఓ యువకుడు తన కష్టంతో, తెలివి తేటలతో చివరకు ఎలా కోటీశ్వరుడు అయ్యాడనేదే సోలోబాయ్ కథ. ఇలాంటి కాన్సెప్ట్‌తో తెలుగులో చాలా సినిమాలే వచ్చాయి. అయితే వాటి ఛాయలు ఇందులో కనిపించకుండా చేయడంతో దర్శకుడు కొంతమేర సక్సెస్ అయ్యాడు. రొటీన్ కథే అయినా.. కథనం కొత్తగా, ఆసక్తికరంగా ఉంటుంది. ప్రతి వ్యక్తి కనెక్ట్ అయ్యే విధంగా ఈ కథను తీర్చిదిద్దారు. మధ్యతరగతి కుటుంబంలో ఉండే బాధలు, అవమానాలు తెరపై కళ్లకు కట్టినట్లు చూపించారు. కాలేజీ సీన్లు యువతను ఆకట్టుకుంటాయి. ఫస్టాఫ్‌లో కథ కృష్ణమూర్తి కాలేజీ లైఫ్.. పెళ్లి..విడాకులు చుట్టు తిరుగుతుంది. సెకండాఫ్‌లో కృష్ణమూర్తి ఎలా కోటీశ్వరుడు అయ్యాడనేని చూపించారు. మధ్యలో దళారి వ్యవస్థ రైతులను ఎలా మోసం చేస్తుందనే పాయింట్ కూడా ఉంటుంది. అయితే దాన్ని అలా టచ్ చేసి మళ్లీ రొటీన్ కథలోకి వెళ్లిపోయారు. ఈ సినిమాలో కృష్ణమూర్తి పాత్రలో గౌతమ్ కృష్ణ సంపూర్ణ నటుడిగా తనని తాను ప్రూవ్ చేసుకుంటూ ఎమోషన్స్ నుండి ప్రతి సీన్లను ప్రేక్షకులను మెప్పించారు. ప్రియా క్యారెక్టర్ లో రమ్య పసుపులేటి సినిమాలో కనిపించే స్క్రీన్ టైమ్ తక్కువ అయినప్పటికీ మంచి మంచి ఇంపాక్ట్ ఉండే పాత్రగా నిలిచారు. అలాగే శ్వేత అవస్తి మంచి పర్ఫామెన్స్ తో తన పాత్రకు పూర్తి న్యాయం చేశారు. పోసాని మురళి, అనిత చౌదరి హీరోకు తల్లిదండ్రులుగా ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీ వాతావరణం లో చాలా బాగా నటించారు. అలాగే భద్రం, షఫీ, చక్రపాణి తదితరులు తమ పాత్రల పరిధిలో నటిస్తూ చిత్రానికి బోనస్‌గా నిలిచారు. సినిమాలోని పాటలు సిచువేషన్ కి తగ్గట్లు బీజీయంతో సినిమాను మరో మెట్టు పైకి వెళ్లే విధంగా సంగీత దర్శకుడు సహాయపడ్డాడు. నిర్మాణ విలువలు బాగున్నాయి. -
‘సోలో బాయ్’ ప్రతి ఒక్కరిలో కనిపిస్తాడు : సెవెన్ హిల్స్ సతీష్
సొంతంగా కష్టపడి తన కాళ్ళ మీద తాను బతకాలనుకునే ఆలోచన గల వ్యక్తి చుట్టు తిరిగే కథే ఇది. ప్రతి ఒక్కరిలోను సోలో బాయ్ క్యారెక్టర్ కనిపిస్తుంది. సినిమా అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకునేలా ఉంటుంది అన్నారు నిర్మాత సెవెన్ హిల్స్ సతీష్. బిగ్ బాస్ ఫేమ్ గౌతమ్ కృష్ణ హీరోగా రమ్య పసుపులేటి, శ్వేత అవస్తి హీరోయిన్స్ గా నటించిన ఈ చిత్రానికి నవీన్ కుమార్ దర్శకత్వం వహించారు. జులై 4న ఈ చిత్రం విడుదల కానుంది. ఈ నేపథ్యంలో నిర్మాత సతీష్ మీడియాతో ముచ్చటించారు. ఆ విశేషాలు..→ గతంలో బట్టల రామకృష్ణ బయోపిక్ సినిమా తీసినప్పుడు ఒక ఎక్స్పరిమెంట్ లాగా చేశాం. అది మాకు వర్కౌట్ అయింది. ఇప్పుడు ఆ సమయంలో నేర్చుకున్న వాటిని బేస్ చేసుకుని తగ్గ జాగ్రత్తలు తీసుకుంటూ సోలో బాయ్ సినిమా చేశాము. కానీ ప్రస్తుతం స్టార్స్ ఉన్న సినిమాలకు థియేటర్లు ముందుగానే బ్లాక్ అవుతున్నాయి. సింగిల్ స్క్రీన్స్ పై ఇంకా బ్యాలెన్స్ కాలేదు.→ ఈ సినిమా సెన్సార్ పూర్తి చేసుకునేప్పటికీ రెండు గంటల పది నిమిషాలు ఫైనల్ అవుట్ పుట్ వచ్చింది. U/A సర్టిఫికేట్ తో ఆంధ్ర తెలంగాణలో కలిపి సుమారు 120 నుండి 150 స్క్రీన్స్ మధ్యలో విడుదల కానుంది.→ గౌతమ్ ఈ సినిమా ప్రమోషన్లలో 100% మంచి సపోర్ట్ ఇస్తున్నారు. బిగ్ బాస్ రెండు సీజన్లో ఉండటం వల్ల అతని ఫేమ్ ఈ సినిమాకు మరింత తోడ్పడుతుంది అనుకుంటున్నాను.→ నాకు ఉన్న బడ్జెట్లో నాకు ఉన్న సర్కిల్లో నేను మంచి సినిమాని ప్రేక్షకులకు అందించడానికి ప్రయత్నం చేశాను. అది కచ్చితంగా ప్రేక్షకులను అన్ని విధాలుగా ఎంటర్టైన్ చేసి ప్రేక్షకుల ఆదరణ పొందుతుందని అనుకుంటున్నాను.→ ఈ చిత్ర కథలు నా ఇన్వాల్వ్మెంట్ కొంత ఉంది. ఒక స్క్రిప్ట్ అనుకుంటున్నాము. నా మిత్రులు ఎవరైనా నిర్మాతలుగా ఆ కథకు నేను దర్శకుడిగా చేద్దామనుకుంటున్నాను. అనుకున్న బడ్జెట్ కంటే కొంత తక్కువలోనే ఈ సినిమాను పూర్తి చేయగలిగాం→ నార్నె నితిన్ తో ఒక సినిమా చేయబోతున్నాను. థ్రిల్లర్ జోనర్ లో కథ ఒకే అయింది. -
జవాన్ కుటుంబానికి సాయం.. మర్యాదగా మాట్లాడండి: గౌతమ్ వార్నింగ్
బిగ్ బాస్ సీజన్ 7 ఫేమ్ గౌతమ్ కృష్ణ హీరోగా, రమ్య పసుపులేటి, శ్వేత అవస్తి హీరోయిన్లుగా నటించిన చిత్రం సోలో బాయ్. అనిత చౌదరి, పోసాని కృష్ణ మురళి, అరుణ్ కుమార్, భద్రం, షఫీ, ఆర్కే మామ తదితరులు కీలకపాత్రలు పోషించారు. నవీన్ కుమార్ దర్శకత్వం వహించిన ఈ చిత్రానికి త్రిలోక్ సిద్దు సినిమాటోగ్రాఫర్‌గా, జుడా సంధ్య మ్యూజిక్ డైరెక్టర్‌గా వ్యవహరించారు. ప్రవీణ్ పూడి ఎడిటింగ్ చేశారు. సెవెన్ హిల్స్ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై శ్రీమతి వినాద్రి, బేబీ నేహా శ్రీ సమర్పణలో సెవెన్ హిల్స్ సతీష్ నిర్మించారు. జూలై 4వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానున్న ఈ మూవీ ప్రీరిలీజ్ ఈవెంట్‌కు వివి వినాయక్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు.డైరెక్టర్ అవుదామని వచ్చి..ఈ సందర్భంగా వివి వినాయక్ మాట్లాడుతూ... "నిర్మాత సతీష్ ఒక దర్శకునిగా ఇండస్ట్రీకి వచ్చి బట్టల రామస్వామి బయోపిక్ ద్వారా నిర్మాతగా మారారు. ఎంతో కష్టపడి చాలా సాధారణ స్థాయి నుంచి ఇక్కడ వరకు వచ్చారు. ఈ చిత్రంలో నటించిన గౌతమ్ కృష్ణకు మంచి భవిష్యత్తు ఉండాలని కోరుకుంటున్నాను" అన్నారు. రఘు కుంచె మాట్లాడుతూ... "నిర్మాత సతీష్ నాకు ఎంతోకాలంగా పరిచయం. ఆయన ఓటీటీ ద్వారా విడుదల చేసిన బట్టల రామస్వామి బయోపిక్ మంచి విజయాన్ని సాధించింది. ఆ తర్వాత ఆర్పీ పట్నాయక్ గారితో కలిసి చేసిన కాఫీ విత్ ఎ కిల్లర్ ఎంతో పాపులర్ అయింది. ఇప్పుడు సోలో బాయ్ మంచి విజయాన్ని సాధించాలని కోరుకుంటున్నా" అన్నారు.బిగ్‌బాస్ నుంచి హీరోగా..హీరో గౌతమ్ కృష్ణ మాట్లాడుతూ... "నేను బిగ్‌బాస్‌కు వెళ్లక ముందు ఈ సినిమా మొదలైంది. నాకు ఎటువంటి ఫేమ్ లేని సమయంలో నన్ను నమ్మి సతీష్ గారు ఈ సినిమా మొదలుపెట్టారు. దానికి ఆయనకు కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. చిత్ర పరిశ్రమలో ఎటువంటి పరిచయాలు లేకుండా కేవలం బిగ్ బాస్ నుంచి బయటకు వచ్చి ఇలా ఒక సినిమాలో హీరోలా నిలబడటం అనేది చాలా పెద్ద విషయం. నేను దాన్ని ఒక సక్సెస్ లా చూస్తున్నాను.మర్యాద ఇచ్చి మాట్లాడండిఅలాగే దివంగత జవాన్ మురళి నాయక్ గారి కుటుంబానికి మేము అండగా నిలిచి ఆర్థిక సాయం చేసిన విషయం అందరికీ తెలిసిందే. కానీ కొంతమంది సోషల్ మీడియాలో ఆ కుటుంబానికి ఇప్పటికే ఎంతోమంది సహాయం చేశారు, ఇంకా మీరు ఎందుకు ఇస్తున్నారు? అని అన్నారు. మురళి నాయక్ అనే వ్యక్తి ఒక సైనికుడు. ఆయనకు మర్యాద ఇచ్చి మాట్లాడండి. జై హింద్" అంటూ ముగించారు. సోలో బాయ్ ట్రైలర్ లాంచ్ ఈవెంట్లో గౌతమ్.. మురళీ నాయక్ పేరెంట్స్‌కు రూ.1 లక్ష ఆర్థిక సాయం చేశాడు.చదవండి: మీ చేతిలో కీలుబొమ్మలం కాదు.. స్నేహితురాలిని పెళ్లాడిన నటి!? -
‘సోలో బాయ్’ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ (ఫోటోలు)
-
'అశ్వత్థామ'గా గౌతమ్.. ఇదేందయ్యా ఇది.. ఇంకా మర్చిపోలే?
ఎక్కడ పోగొట్టుకున్నారో అక్కడే వెతుక్కోవాలంటారు. గౌతమ్ కృష్ణ (Gautham Krishna) అదే చేశాడు. బిగ్‌బాస్ షో వల్ల అవమానాలు పడ్డాడు, ఆదరణ పొందాడు. అదెలాగంటే.. తెలుగు బిగ్‌బాస్ ఏడో సీజన్లో పాల్గొన్న ఇతడు శివాజీకి కరెక్ట్ మొగుడిలా తయారయ్యాడు. నేను పట్టుకున్న మంచానికి మూడే కాళ్లు అన్నట్లు శివాజీ డిక్టేటర్‌గా వ్యవహరిస్తుంటే అది తప్పని ఎదిరించి నిలబడ్డాడు గౌతమ్ కృష్ణ. శివాజీని ప్రశ్నించేందుకు హౌస్మేట్స్ వెనకడుగు వేస్తుంటే గౌతమ్ మాత్రం అతడి పెద్దరికాన్ని గౌరవిస్తూనే మాటలు, చేతలతోనే ధీటుగా సమాధానం చెప్పేవాడు. అశ్వత్థామ అంటూ నవ్వులపాలు!కానీ షో మధ్యలోనే ఎలిమినేట్ అయ్యాడు. అయితే అతడిని వైల్డ్ కార్డ్‌గా హౌస్‌లోకి పంపించినప్పుడు అశ్వత్థామ 2.0 అంటూ వేసిన డైలాగ్ అప్పట్లో సోషల్ మీడియాలో తెగ హల్చల్ చేసింది. ఆ డైలాగ్‌కు ఓవర్ కాన్ఫిడెన్స్ తోడవడంతో గౌతమ్‌పై ట్రోలింగ్ జరిగింది. చివరకు ఫినాలేకు అడుగు దూరంలో ఉండగా ఎలిమినేట్ అయ్యాడు.అశ్వత్థామకు చావు లేదుబిగ్బాస్ 8వ సీజన్లో మరోసారి వైల్డ్‌కార్డ్‌గా ఎంట్రీ ఇచ్చాడు. ఎక్కడైతే మాటలు పడ్డాడో అక్కడే తన మాటతో, ఆటతో ప్రశంసలు దక్కించుకున్నాడు. రన్నరప్‌గా నిలిచాడు. మరోసారి చెప్తున్నా.. అశ్వత్థామ ఈజ్ బ్యాక్.. ఈ అశ్వత్థామకు చావు లేదు అంటూ షోలో డైలాగ్స్ వేశాడు. ఇప్పుడదే డైలాగ్‌ను తన పేరు ముందు చేర్చేసుకున్నాడు.పేరు ముందు అదే ట్యాగ్గౌతమ్ హీరోగా నటిస్తున్న తాజా చిత్రం సోలో బాయ్ (Solo Boy Movie). బుధవారం ఈ మూవీ ట్రైలర్ రిలీజైంది. ఇందులో గౌతమ్ తన పేరు ముందు అశ్వత్థామ అన్న ట్యాగ్ యాడ్ చేసుకున్నాడు. విమర్శలు, ప్రశంసలు అందించిన అశ్వత్థామ ట్యాగ్‌ను గౌతమ్ వాడుకోవడం చూసి నెటిజన్లు పలు రకాలుగా స్పందిస్తున్నారు. అప్పుడే ఈ ట్యాగ్లు అవసరమా? అని కొందరు బుగ్గలు నొక్కుకుంటున్నారు. అయితే సినిమా కోసం నలుగురు మాట్లాడాలంటే ఇలాంటి ప్రయత్నాలు చేయడం మంచిదే, అందులోనూ అతడు పడి నిలబడ్డాడు అని మరికొందరు పాజిటివ్‌గా రియాక్ట్ అవుతున్నారు . చదవండి: రజనీకాంత్ వదిలేసుకున్న అపరిచితుడు.. ఫస్ట్ హీరోయిన్ సదా కాదు -
బిగ్‌బాస్ ఫేమ్ హీరోగా సోలో బాయ్.. రిలీజ్ ఎప్పుడంటే?
బిగ్ బాస్ 7 కంటెస్టెంట్ గౌతమ్ కృష్ణ హీరోగా నటిస్తోన్న తాజా చిత్రం 'సోలో బాయ్'. ఈ చిత్రంలో శ్వేతా అవస్తి, రమ్య పసుపులేటి హీరోయిన్లుగా నటించారు. నవీన్ కుమార్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని సెవెన్ హిల్స్ ప్రొడక్షన్స్ పై సతీష్ కుమార్ నిర్మిస్తున్నారు. తాజాగా ఈ మూవీ రిలీజ్ డేట్‌ను అనౌన్స్ చేశారు మేకర్స్.వచ్చేనెల 4వ తేదీన థియేటర్లలో సందడి చేయనుందని ప్రకటించారు. బిగ్‌బాస్‌తో ఫేమ్ తెచ్చుకున్న గౌతమ్ కృష్ణ హీరోగా అభిమానులను అలరించనున్నారు. ఇప్పటికే రిలీజైన ఫస్ట్ లుక్ పోస్టర్ ఫ్యాన్స్‌ను ఆకట్టుకుంది. ఈ కథ చాలా కొత్తగా అనిపించి, ఈ సినిమాను నిర్మించినట్లు డైరెక్టర్ నవీన్ అన్నారు. ఈ చిత్రం కచ్చితంగా అందరికి నచ్చుతుందని తెలిపారు. కాగా.. గౌతమ్ కృష్ణ గతంలో ఆకాశవీధుల్లో అనే చిత్రంలో నటించారు.ఇప్పటికే ఈ మూవీ నుంచి రిలీజైన పడిపోయానే సఖి అనే లిరికల్ సాంగ్‌కు అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. ఈ రొమాంటిక్ లవ్ సాంగ్ ఆడియన్స్‌ను విపరీతంగా ఆకట్టుకుంది. ఈ చిత్రంలో పోసాని కృష్ణ మురళి, అనిత చౌదరి, డాక్టర్ భద్రం, అరుణ్ కుమార్, ఆర్కే మామ, షఫీ కీలక పాత్రల్లో నటించారు. ఈ సినిమాకు జుడా సంధి సంగీతమందించారు. Not every hero wears a cape.Some just carry silent dreams and heavy hearts. 💔#SoloBoy – a boy, a battle, a beautiful transformation.🎬 In cinemas from 4th JULY!Produced by @SevenhillsSati3Directed by #PNaveenKumarMusic by @judahsandhy@igauthamkrishna @RamyaPasupulet9… pic.twitter.com/gFajsk8eba— Telugu FilmNagar (@telugufilmnagar) June 4, 2025 -
జీరో టు హీరో అయ్యే ఓ అబ్బాయి కథే ‘సోలో బాయ్’: నిర్మాత సతీష్
‘‘కంటెంట్ ఉన్న సినిమాలను తెలుగు ప్రేక్షకులు ఎప్పుడూ ఆదరిస్తుంటారు. గతంలో నేను తీసిన ‘బట్టల రామస్వామి బయోపిక్, అందరి బంధువయా’ సినిమాలకు ప్రేక్షకుల ఆదరణ దక్కింది. త్వరలోనే ‘కాఫీ విత్ ఏ కిల్లర్, సోలో బాయ్’ సినిమాల విడుదలను ప్లాన్ చేస్తున్నాం. ఈ చిత్రాలూ ప్రేక్షకులను అలరిస్తాయనే నమ్మకం ఉంది’’ అని తెలిపారు నిర్మాత ‘సెవెన్ హిల్స్’ సతీష్. బుధవారం (అక్టోబరు 23) ఆయన బర్త్ డే. ఈ సందర్భంగా మంగళవారం సతీష్ మాట్లాడుతూ– ‘‘క్రైమ్ థ్రిల్లర్‌గా రానున్న ‘కాఫీ విత్ ఏ కిల్లర్’ సినిమాకు ఆర్పీ పట్నాయక్‌గారు దర్శకత్వం వహించారు. ఇక జీరో నుంచి హీరో అయ్యే ఓ అబ్బాయి కథగా ‘సోలో బాయ్’ సినిమా ఉంటుంది. ఇందులో గౌతమ్ కృష్ణ హీరోగా నటించారు. శ్వేతా అవస్తి, రమ్య పసుపులేటి హీరోయిన్లుగా నటించారు. త్వరలోనే రిలీజ్ డేట్ ప్రక టిస్తాం’’ అని తెలిపారు. -
‘సోలో బాయ్’గా వస్తున్న గౌతమ్
బిగ్ బాస్ 7 కంటెస్టెంట్ గౌతమ్ కృష్ణ హీరోగా నటిస్తోన్న తాజా చిత్రం సోలో బాయ్. నవీన్ కుమార్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని సెవెన్ హిల్స్ ప్రొడక్షన్స్ పై సెవెన్ హిల్స్ సతీష్ కుమార్ నిర్మిస్తున్నారు. నేడు(ఏప్రిల్ 14) గౌతమ్ పుట్టిన రోజు. ఈ సందర్భంగా చిత్రబృందం గౌతమ్ బర్త్‌డేని గ్రాండ్‌గా సెలెబ్రేట్ చేసింది. ఈవెంట్లో హీరో గౌతమ్ కృష్ణ, హీరో ఫాదర్ మనోజ్ గారు, సెవెన్ హిల్స్ సతీష్ గారు, డైరెక్టర్ నవీన్ కుమార్ గారు, అనిత చౌదరి గారు, కమెడియన్ భద్రం, పింగ్ పాంగ్( సూర్య ) పాల్గొన్నారు. హీరో గౌతమ్ కృష్ణ మాట్లాడుతూ : నా పుట్టినరోజు పూట మూవీ టీం ఇలా ఈవెంట్ చేయడం చాలా ఆనందంగా ఉంది. ఈ టీమ్ అందరూ కూడా సినిమా మీద ఇష్టంతో పని చేసినవారే. బడ్జెట్ విషయంలో కూడా ఎక్కడ కాంప్రమైజ్ అవ్వకుండా మంచి కంటెంట్ ని తీసుకొస్తున్నాం. అతి త్వరలో టీజర్, ట్రైలర్, సాంగ్స్ తో మీ ముందుకు వస్తాం. ప్రేక్షకులు అందరూ ఈ సినిమాని ఆదరించి మంచి సక్సెస్ చేయాలని కోరుకుంటున్నాను ’ అన్నారు. డైరెక్టర్ నవీన్ చెప్పిన కథ చాలా కొత్తగా అనిపించి, ఈ సినిమాను నిర్మించాను. ఈ చిత్రం కచ్చితంగా అందరికి నచ్చుతుంది’ అని ప్రొడ్యూసర్ సెవెన్ హిల్స్ సతీష్ కుమార్ అన్నారు. చిన్న సినిమా పెద్ద సినిమాను ఉండదు మంచి సినిమా నే ఉంటుంది. సోలో బాయ్ కూడా ఒక మంచి సినిమా. మా హీరో గౌతమ్ కృష్ణ చాలా బాగా నటించాడు. సాంగ్స్ ఫైట్స్ ఎమోషనల్ సీన్స్ అన్నిటిలోనూ తనదైన శైలితో నటించాడు. ఈ చిత్రం కచ్చితంగా విజయం సాధిస్తుంది’ అన్నారు దర్శకుడు పి.నవీన్ కుమార్. -
సోలో బాయ్ మూవీ ప్రెస్ మీట్ (ఫోటోలు)
-
బిగ్ బాస్ ఫేమ్ గౌతమ్ కృష్ణ హీరోగా ‘సోలో బాయ్’
‘బిగ్‌బాస్’ఫేమ్ గౌతమ్ కృష్ణ హీరోగా నటిస్తున్న తాజా చిత్రం ‘సోలో బాయ్’. శ్వేతా అవాస్తి, రమ్య పసుపులేటి కీలక పాత్రలు పోషిస్తున్నారు. పి. నవీన్ కుమార్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్నిసెవెన్ హిల్స్ ప్రొడక్షన్స్ బ్యానర్ పై సెవెన్ హిల్స్ సతీష్ నిరించారు. ఈ సినిమాకి కొరియోగ్రాఫర్ గా ఆట సందీప్ వ్యవహరిస్తున్నారు. ఈ సినిమా టైటిల్ అనౌన్స్మెంట్ మరియు ఫస్ట్ లుక్ పోస్టర్ వేడుక ఈ నెల 7వ తేదీన జరిగింది. ఈ కార్యక్రమంలో నిర్మాత సెవెన్ హిల్స్ సతీష్ గారు మాట్లాడుతూ - కోవిడ్ టైంలో నేను బట్టల రామస్వామి బయోపిక్ అనే సినిమా తీశాను. కోవిడ్ పాండమిక్ టైం లో ఓటిటి ద్వారా ప్రజలకు ఎంటర్టైన్మెంట్ ఇచ్చాం. తర్వాత ఒక మంచి కథ కోసం ఎదురు చూస్తున్న టైం లో ఈ కథ నచ్చి మీ ముందుకు తీసుకుని వచ్చాం. ఈ జెనరేషన్ ఆడియెన్స్ చూడాల్సిన సినిమా. వాళ్లకు ఈజీగా కనెక్ట్ అయ్యే అంశాలు ఉంటాయి. రెండు పాటలు మినహా పూర్తి చిత్రం షూటింగ్ పూర్తయింది. ఈ సినిమాతో గౌతమ్ మళ్లీ మీ ముందుకు వస్తున్నాడు గతంలో ఆకాశవీధిలో సినిమాతో అలాగే బిగ్ బాస్ 7 లో ప్రేక్షకుల మనసులు దోచుకున్నాడు. ఇప్పుడు సోలో బాయ్ సినిమాతో మళ్లీ మీ ముందుకు రాబోతున్నాడు. ఇప్పుడు ఈ సినిమా ఫస్ట్ లుక్ తో వచ్చాం ఫ్యూచర్లో టీజర్, ట్రైలర్ తో మీ ముందుకు వస్తాం. సో ఈ సినిమాని ఆదరించి మమ్మల్ని ఆశీర్వదించాలని కోరుకుంటున్నాం. ఈ సినిమా చూసి బయటకు వచ్చేప్పుడు కనీసం పది నిమిషాలు ఆలోచిస్తారు. అన్నారు. హీరో గౌతమ్ కృష్ణ మాట్లాడుతూ - గతంలో ఆకాశవీధిలో చేసినప్పుడు నటుడిగా మంచి గుర్తింపు వచ్చంది. తర్వాత వేరే కథలు వింటున్నప్పుడు బిగ్ బాస్ ఆఫర్ వచ్చింది. జనాలు నన్ను బాగా ఆదరించారు. ఈ రోజు మా సినిమా "సోలో బాయ్" సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్ రిలీజ్ కావడం హ్యాపీగా ఉంది. ముందు ముందు టీజర్ ట్రైలర్ ప్రమోషన్స్ తో కొత్తగా మీ ముందుకు రావడానికి సిద్ధంగా ఉన్నాం. మా సినిమా అనుకున్న దానికంటే బాగా రూపొందించాం. ఈ సినిమా చేస్తూ చేస్తూ మేమూ మూవీతో కనెక్ట్ అయ్యాం. తెలుగు ప్రేక్షకులకు మంచి టేస్ట్ ఉంది. మంచి సినిమాలను తప్పకుండా ఆదరిస్తారు. గతంలో ఆకాశవీధిలో, బిగ్ బాస్ తో ఎలా అయితే ఆదరించారో ఇప్పుడీ సినిమాతో కూడా అలాగే ఆదరించి ఆశీర్వదించాలని కోరుకుంటున్నాను. ఈ సినిమాని సెవెన్ హిల్స్ సతీష్ గారు ప్రొడ్యూస్ చేయడం ఆనందంగా ఉంది అన్నారు.