
సొంతంగా కష్టపడి తన కాళ్ళ మీద తాను బతకాలనుకునే ఆలోచన గల వ్యక్తి చుట్టు తిరిగే కథే ఇది. ప్రతి ఒక్కరిలోను సోలో బాయ్ క్యారెక్టర్ కనిపిస్తుంది. సినిమా అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకునేలా ఉంటుంది అన్నారు నిర్మాత సెవెన్ హిల్స్ సతీష్. బిగ్ బాస్ ఫేమ్ గౌతమ్ కృష్ణ హీరోగా రమ్య పసుపులేటి, శ్వేత అవస్తి హీరోయిన్స్ గా నటించిన ఈ చిత్రానికి నవీన్ కుమార్ దర్శకత్వం వహించారు. జులై 4న ఈ చిత్రం విడుదల కానుంది. ఈ నేపథ్యంలో నిర్మాత సతీష్ మీడియాతో ముచ్చటించారు. ఆ విశేషాలు..
→ గతంలో బట్టల రామకృష్ణ బయోపిక్ సినిమా తీసినప్పుడు ఒక ఎక్స్పరిమెంట్ లాగా చేశాం. అది మాకు వర్కౌట్ అయింది. ఇప్పుడు ఆ సమయంలో నేర్చుకున్న వాటిని బేస్ చేసుకుని తగ్గ జాగ్రత్తలు తీసుకుంటూ సోలో బాయ్ సినిమా చేశాము. కానీ ప్రస్తుతం స్టార్స్ ఉన్న సినిమాలకు థియేటర్లు ముందుగానే బ్లాక్ అవుతున్నాయి. సింగిల్ స్క్రీన్స్ పై ఇంకా బ్యాలెన్స్ కాలేదు.
→ ఈ సినిమా సెన్సార్ పూర్తి చేసుకునేప్పటికీ రెండు గంటల పది నిమిషాలు ఫైనల్ అవుట్ పుట్ వచ్చింది. U/A సర్టిఫికేట్ తో ఆంధ్ర తెలంగాణలో కలిపి సుమారు 120 నుండి 150 స్క్రీన్స్ మధ్యలో విడుదల కానుంది.
→ గౌతమ్ ఈ సినిమా ప్రమోషన్లలో 100% మంచి సపోర్ట్ ఇస్తున్నారు. బిగ్ బాస్ రెండు సీజన్లో ఉండటం వల్ల అతని ఫేమ్ ఈ సినిమాకు మరింత తోడ్పడుతుంది అనుకుంటున్నాను.
→ నాకు ఉన్న బడ్జెట్లో నాకు ఉన్న సర్కిల్లో నేను మంచి సినిమాని ప్రేక్షకులకు అందించడానికి ప్రయత్నం చేశాను. అది కచ్చితంగా ప్రేక్షకులను అన్ని విధాలుగా ఎంటర్టైన్ చేసి ప్రేక్షకుల ఆదరణ పొందుతుందని అనుకుంటున్నాను.
→ ఈ చిత్ర కథలు నా ఇన్వాల్వ్మెంట్ కొంత ఉంది. ఒక స్క్రిప్ట్ అనుకుంటున్నాము. నా మిత్రులు ఎవరైనా నిర్మాతలుగా ఆ కథకు నేను దర్శకుడిగా చేద్దామనుకుంటున్నాను. అనుకున్న బడ్జెట్ కంటే కొంత తక్కువలోనే ఈ సినిమాను పూర్తి చేయగలిగాం
→ నార్నె నితిన్ తో ఒక సినిమా చేయబోతున్నాను. థ్రిల్లర్ జోనర్ లో కథ ఒకే అయింది.