సస్పెన్స్ థ్రిల్లర్ కాన్సెప్ట్‌తో 'టెనెంట్‌' ట్రైలర్‌ | Satyam Rajesh Tenant Movie Release Trailer Out Now | Sakshi
Sakshi News home page

సస్పెన్స్ థ్రిల్లర్ కాన్సెప్ట్‌తో 'టెనెంట్‌' ట్రైలర్‌

Apr 13 2024 2:14 PM | Updated on Apr 13 2024 2:14 PM

 Satyam Rajesh Tenant Movie Release Trailer Out Now - Sakshi

కమెడియన్‌గా, క్యారెక్టర్‌ ఆర్టిస్ట్‌గా ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న సత్యం రాజేశ్‌..ఇప్పుడు హీరోగా దూసుకెళ్తున్నాడు. ఆయన ప్రధాన పాత్రలో నటించిన మా ఊరి పొలిమేర సీక్వెల్స్‌తో మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. తాజాగా ఆయన హీరోగా నటించిన ‘టెనెంట్‌’ మూవీ కూడా ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. తాజాగా ఈ మూవీకి సంబంధించిన ట్రైలర్‌ను మేకర్ విడుదల చేశారు.

వై.యుగంధర్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని మహాతేజ క్రియేషన్స్ బ్యానర్ పై మోగుళ్ళ చంద్రశేఖర్ రెడ్డి నిర్మిస్తున్నారు. రవీందర్ రెడ్డి .ఎన్ సహా నిర్మాత. తాజాగా విడుదలైన ఈ చిత్రం ట్రైలర్ కు అద్భుతమైన స్పందన వస్తుంది. ప్రస్తుత కాలంలో మహిళలు ఎంత అప్రమంతంగా ఉండాలో తెలియజేసేలా చాలా విలువైన కంటెంట్ తో పాటు ఫ్యామిలీ ఎమోషనల్ థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ తో ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు. సమ్మర్ స్పెషల్ గా ఏప్రిల్ 19న ఈ చిత్రాన్ని విడుదల  చేస్తున్నారు. మేఘా చౌదరి, చందన పయావుల, భరత్ కాంత్ ఇతర కీలక పాత్రలు పోషిస్తున్న ఈ చిత్రానికి సాహిత్య సాగర్ సంగీతం అందిస్తున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement