ఆ కష్టం నాకు తెలుసు: మనోజ్‌ మంచు | SatyaDev ZEBRA Movie Teaser Launch | Sakshi
Sakshi News home page

ఆ కష్టం నాకు తెలుసు: మనోజ్‌ మంచు

Oct 1 2024 12:02 AM | Updated on Oct 1 2024 12:02 AM

SatyaDev ZEBRA Movie Teaser Launch

‘‘జీబ్రా’ సినిమా కోసం టీమ్‌ ఎంతలా కష్టపడ్డారో నాకు తెలుసు. సత్యదేవ్‌ అద్భుతమైన నటుడు. తన నటనకి నేను అభిమానిని. ‘జీబ్రా’ టీజర్‌ అదిరిపోయింది. ఈ సినిమా గొప్ప విజయం సాధించాలి’’ అని హీరో మనోజ్‌ మంచు అన్నారు. సత్యదేవ్, డాలీ ధనంజయ హీరోలుగా ఈశ్వర్‌ కార్తీక్‌ దర్శకత్వం వహించిన చిత్రం ‘జీబ్రా’. ప్రియా భవానీ శంకర్, జెన్నీఫర్‌ పిక్కీనాటో హీరోయిన్లుగా నటించిన ఈ మూవీలో నటుడు సత్యరాజ్‌ కీలక పాత్ర చేశారు. ఎస్‌ఎన్‌ రెడ్డి, ఎస్‌. పద్మజ, బాల సుందరం, దినేష్‌ సుందరం నిర్మించిన ఈ మూవీ ఈ నెల 31న విడుదల కానుంది.

ఈ మూవీ టీజర్‌ని హీరో నాని సోషల్‌ మీడియా వేదికగా లాంచ్‌ చేశారు. ఈ సందర్భంగా నిర్వహించిన ‘జీబ్రా’ టీజర్‌లాంచ్‌ ఈవెంట్‌కి ముఖ్య అతిథిగా మనోజ్‌ మంచు హాజరయ్యారు. సత్యదేవ్‌ మాట్లాడుతూ–‘‘జీబ్రా’ నా కెరీర్‌లో ఓ మైలురాయిగా నిలుస్తుంది’’ అన్నారు. ‘‘జీబ్రా’ కోసం తెలుగు నేర్చుకుని డబ్బింగ్‌ చెప్పాను’’ అని డాలీ ధనంజయ తెలిపారు. ‘‘ఈ మూవీలో నా పాత్ర పూర్తి వైవిధ్యంగా ఉంటుంది’’ అని సత్య రాజ్‌ చెప్పారు. ‘‘ప్రేక్షకులు మంచి కథని సపోర్ట్‌ చేస్తార నే నమ్మకంతోనే ఈ సినిమా చేశాం’’ అన్నారు ఈశ్వర్‌ కార్తీక్‌. ‘‘జీబ్రా’ చాలా కొత్త కంటెంట్‌. సినిమా ఓ పండగలా ఉంటుంది’’ అని నిర్మాతలు దినేష్‌ సుందరం, బాల సుందరం, ఎస్‌ఎన్‌ రెడ్డి తెలిపారు. జెన్నీఫర్‌ పిక్కీనాటో మాట్లాడారు.

Advertisement
 
Advertisement
Advertisement