'మత్తు వదలరా' సినిమాలతో ఆకట్టుకున్న దర్శకుడు రితేశ్ రానా.. కమెడియన్ సత్యని హీరోగా పెట్టి ఓ మూవీ తీస్తున్నాడు. అదే 'జెట్లీ'. ఇప్పుడు న్యూఇయర్ శుభాకాంక్షలు చెబుతూ గ్లింప్స్ రిలీజ్ చేశారు. జనరల్ కంపార్ట్‌మెంట్ హీరో అని సత్య చివరలో చెప్పిన డైలాగ్ ఫన్నీగా ఉంది.
సత్య, వెన్నెల కిశోర్, రియా సింఘా ప్రధాన పాత్రల్లో నటిస్తున్న ఈ సినిమాని పూర్తిగా ఫ్లైట్‌లోనే తీసినట్లు గ్లింప్స్ చూస్తే అనిపించింది. హైజాక్ లాంటిది జరిగితే విమానంలోని ఉన్న వాళ్లు ఎలా ప్రవర్తించారు, తద్వారా ఎలాంటి కామెడీ వచ్చిందనే పాయింట్‌తో మూవీ తీశారనిపిస్తుంది. వెన్నెల కిశోర్ పాత్ర.. నువ్వు హీరోవా? టైర్ 1? టైర్ 2? అని సత్య పాత్రని అడిగితే.. జనరల్ కంపార్ట్‌మెంట్ అని బాగుంది. బహుశా వేసవిలో దీన్ని థియేటర్లలోకి తీసుకొస్తారేమో?


