సీఎం విజయ్ అలా చేయడం కరెక్ట్ కాదు | Sathya Raj Slams TVK Vijay And Cry For Mk Stalin Loss | Sakshi
Sakshi News home page

Satya Raj: స్టాలిన్ ఓటమి.. కన్నీళ్లు పెట్టుకున్న సత్యరాజ్

Jun 7 2026 8:20 AM | Updated on Jun 7 2026 11:36 AM

Sathya Raj Slams TVK Vijay And Cry For Mk Stalin Loss

'బాహుబలి' కట్టప్ప కన్నీళ్లు పెట్టుకున్నాడు. తాజాగా డీఎంకే నేతృత్వంలో జరిగిన సభలో పాల్గొన్న నటుడు సత్యరాజ్‌ భావోద్వేగానికి గురయ్యాడు. స్టాలిన్ ఓటమి తట్టుకోలేకపోతున్నానని కన్నీళ్లు పెట్టుకున్నాడు. సీఎం విజయ్ తీరుపై తనదైన శైలిలో వ్యంగ్యాస్త్రాలు సంధించాడు.

(ఇదీ చదవండి: 'పెద్ది' వివాదంలో మరో మలుపు.. జాన్వీ కపూర్ చాట్ లీక్?)

స్టాలిన్ ఓడిపోవడాన్ని జీర్ణించుకోలేకపోతున్నాను. సీఎం స్థాయిలో ఉన్న వ్యక్తి హుందాగా మాట్లాడాలి. మాజీ సీఎం అనే గౌరవం లేకుండా స్టాలిన్‌ని విజయ్ విమర్శించడం సరికాదు. మీకు బూతులు వస్తాయంటే నాకు మీకన్నా బాగా వస్తాయి. టీవీకే సోషల్ మీడియా నన్ను టార్గెట్ చేసినా నేను ఎవరికీ భయపడను అని సత్యరాజ్ అన్నాడు.

సీఎం విజయ్‌ పార్టీని ఉద్దేశిస్తూ మాట్లాడిన సత్యరాజ్.. పేర్లు మార్చితే సరిపోదు. ద్రావిడ మోడల్‌ ఇప్పటికే ఎన్నో మార్పులు తెచ్చింది. సినిమాపై అభిరుచి ఉండటం వేరు, రాజకీయం వేరు. మార్పు కావాలనుకున్నప్పుడు, అది ఎలాంటి మార్పు అనేది ఆలోచించాల్సిన అవసరముంది. ద్రావిడ సామాజిక న్యాయ భావజాలానికి భిన్నమైన సిద్ధాంతాలు వస్తే ప్రజలు ఆలోచించాలి. సోదరుడు విజయ్‌.. అంబేడ్కర్‌, ద్రావిడ , తమిళ జాతీయవాదం తన రెండు కళ్లు అంటున్నారు. ఇక్కడ కేవలం నాయకులు, వ్యక్తులు మాత్రమే మారుతున్నారు. పార్టీలలో లోపాలు ఉంటే వాటిని ప్రశ్నించి, పరిష్కరించే వారికే ఓటు వేయాలి. రాబోయే రోజుల్లో కూడా స్టాలిన్‌ నాయకత్వమే బలంగా ఉంటుందని ఆశాభావం వ్యక్తం చేశాడు.

ఇకపోతే సత్యరాజ్.. డీఎంకే పార్టీకి సపోర్ట్ చేస్తుండగా ఈయన కొడుకు శిబి సత్యరాజ్ మాత్రం విజయ్ టీవీకే పార్టీకి సపోర్ట్ చేస్తుండటం విశేషం.

(ఇదీ చదవండి: అదే నిజమైన ఆనందం: మృణాల్ ఠాకుర్)

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement