గోదావరి నేపథ్యంలో... | Sasivadane to release on April 19 | Sakshi
Sakshi News home page

గోదావరి నేపథ్యంలో...

Mar 22 2024 5:58 AM | Updated on Mar 22 2024 5:59 AM

Sasivadane to release on April 19 - Sakshi

కోమలీ ప్రసాద్, రక్షిత్‌ అట్లూరి

‘పలాస 1978’ ఫేం రక్షిత్‌ అట్లూరి హీరోగా, కోమలీ ప్రసాద్‌ హీరోయిన్‌గా నటించిన చిత్రం ‘శశివదనే’. సాయి మోహన్‌ ఉబ్బర దర్శకుడు. గౌరీ నాయుడు సమర్పణలో అహితేజ బెల్లంకొండ, అభిలాష్‌ రెడ్డి గోడల నిర్మించిన ఈ చిత్రం ఏప్రిల్‌ 19న రిలీజ్‌ కానుంది. ఈ సందర్భంగా అహితేజ బెల్లంకొండ, అభిలాష్‌ రెడ్డి మాట్లాడుతూ– ‘‘మా సినిమాని ఏప్రిల్‌ 5న రిలీజ్‌ చేద్దామనుకున్నాం.

కానీ డిస్ట్రిబ్యూటర్స్‌ అడిగిన  మేరకు 19న రిలీజ్‌ చేస్తున్నాం’’ అన్నారు. ‘‘గోదావరి నేపథ్యంలో లవ్‌ అండ్‌ యాక్షన్‌ డ్రామా గా తెరకెక్కిన చిత్రం ‘శశివదనే’’ అన్నారు సాయి మోహన్‌ ఉబ్బర. ‘‘నా ‘పలాస 1978’ కంటే ‘శశివదనే’ పెద్ద హిట్‌ అవుతుందనే నమ్మకం ఉంది’’ అన్నారు రక్షిత్‌ అట్లూరి. కోమలీ ప్రసాద్, ఎగ్జిక్యూటివ్‌ప్రోడ్యూసర్‌ శ్రీపాల్, సినిమాటోగ్రాఫర్‌ శ్రీసాయి కుమార్‌ దారా మాట్లాడారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement