‘సరిపోదా శనివారం’ టాక్‌ ఎలా ఉందంటే..? | Saripodhaa Sanivaaram Movie Twitter Review In Telugu, Check Tweets Inside | Sakshi
Sakshi News home page

Saripodhaa Sanivaaram Twitter Review: ‘సరిపోదా శనివారం’ టాక్‌ ఎలా ఉందంటే..?

Aug 29 2024 7:00 AM | Updated on Aug 29 2024 10:46 AM

Saripodhaa Sanivaaram Movie Twitter Review

‘అంటే సుందరానికి’తర్వాత నేచురల్‌ స్టార్‌ నాని, క్రియేటివ్‌ డైరెక్టర్‌ వివేక్‌ ఆత్రేయ కాంబినేషన్‌లో తెరకెక్కిన చిత్రం ‘సరిపోదా శనివారం’.  ప్రియాంక అరుల్ మోహన్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ మూవీలో ఎస్‌జే సూర్య పవర్ ఫుల్ రోల్ ప్లే చేశాడు. ఇప్పటికే విడుదలైన ట్రైలర్‌, సాంగ్స్‌ సినిమాపై అంచనాలను పెంచేశాయి. దానికి తోడు సినిమా ప్రమోషన్స్‌ కూడా గట్టిగా చేయడంతో ‘సరిపోదా శనివారం’పై భారీ హైప్‌ క్రియేట్‌ అయింది. భారీ అంచనాల మధ్య నేడు(ఆగస్ట్‌ 29) ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు వచ్చింది.

ఇప్పటికే ఓవర్సీస్‌తో పాటు పలు చోట్ల ఫస్ట్‌డే ఫస్ట్‌ షో పడిపోయింది. సినిమా చూసిన ప్రేక్షకులు సోషల్‌ మీడియా వేదికగా తమ అభిప్రాయాన్ని వెల్లడిస్తున్నారు. ‘సరిపోదా శనివారం కథేంటి?, నాని-వివేక్‌ ఆత్రేయ ఖాతాలో  హిట్‌ పడిందా లేదా? తదితర విషయాలను ఎక్స్‌(ట్విటర్‌) వేదికగా చర్చిస్తున్నారు. అవేంటో చూసేయండి. . ఇది కేవలం నెటిజన్ల అభిప్రాయం మాత్రమే. ఇందులో పేర్కొన్న అంశాలకు ‘సాక్షి’తో బాధ్యత వహించదు.

ఎక్స్‌లో ఈ చిత్రానికి పాజిటివ్‌ టాక్‌ వస్తుంది. నాని, ఎస్‌జే సూర్య తమ నటనతో అదరగొట్టేశారని, వారి కోసమే ఈ సినిమా చూడాలని నెటిజన్స్‌ కామెంట్‌ చేస్తున్నారు. రొటీన్‌ స్టోరీయే అయినా.. వివేక్‌ తెరపై డిఫరెంట్‌గా చూపించాడని అంటున్నారు. మరికొంత మంది అయితే ఇది యావరేజ్‌ మూవీ అని కామెంట్‌ చేస్తున్నారు. స్క్రీన్‌ప్లే ఫేలవంగా ఉందని, సెకండాఫ్‌ కాస్త సాగదీతగా ఉందని అంటున్నారు. చాలా మంది  జేక్స్‌ బిజాయ్‌ నేపథ్య సంగీతంపై ప్రశంసలు కురిపిస్తున్నారు. బీజీఎం అదరగొట్టేశాడని.. సినిమాకు అదే ప్లస్‌ అని కామెంట్‌ చేస్తున్నారు. 

  వివేక్‌ ఆత్రేయ స్క్రీన్‌ప్లే గొప్పగా ఏమీ లేదు. కానీ ఫస్టాఫ్‌ ఎస్‌జే సూర్య, నానిల యాక్టింగ్‌ అదుర్స్‌. వారి కోసమే సినిమా చూడాలి. ఇంటర్వెల్‌ బ్యాంగ్‌ అదిరిపోయింది. పోతారు.. మొత్తం పోతారు. ఇక సెకండాఫ్‌ మాస్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌. బీజీఎం అదిరిపోయిందని ఓ నెటిజన్‌ కామెంట్‌ చేశారు.

 

 

Advertisement
 
Advertisement
Advertisement