Actor Sarath Babu Ex Wife Rama Prabha Shares Interesting Video About Her Journey, Goes Viral - Sakshi
Sakshi News home page

Rama Prabha: రమాప్రభ ఆసక్తికర వ్యాఖ్యలు.. శరత్‌బాబు కీర్తి మీ వల్లే అంటున్న నెటిజన్లు

Jun 2 2023 9:43 PM | Updated on Jun 3 2023 10:12 AM

Sarath Babu Ex Wife Rama Prabha Shares Interesting Video - Sakshi

అక్కడుంది రమాప్రభ హీరో అని ఎవరూ చెప్పడం లేదు. అందరూ అక్కడే ఉన్నారు కానీ అది నా ఇల్లు అని కాకుండా వేరేవాళ్ల ఇల్లు అని చెప్తున్నారు. నాకు నవ్వొచ్చింది.

దివంగత నటుడు శరత్‌ బాబు మాజీ భార్య రమాప్రభ తనపై వస్తున్న కొన్ని వార్తలపై మండిపడింది. అదే సమయంలో శరత్‌ బాబు మరణ వార్తపై పరోక్షంగా విచారం వ్యక్తం చేసింది. ఈ మేరకు రమాప్రభ ప్రయాణం అనే సొంత యూట్యూబ్‌ ఛానల్‌లో ఓ వీడియోను వదిలింది.

'ఈ మూడు నెలల్లో చిన్న టూర్లు వేశాను. హైదరాబాద్‌, విజయవాడ, తిరుపతి, షిరిడీ వెళ్లొచ్చాను. ఈ మూడు నెలల్లో ఎన్నో మార్పులు జరిగాయి. కొన్ని సంఘటనలు జరిగాయి. ఒక్కోసారి జాలేస్తుంది.. ఒక్కోసారి నవ్వు వస్తుంది.. ఒక్కోసారి బాధగా ఉంటుంది.. ఈ మధ్య ఏదో ఒకరకంగా పాపులర్‌ అవుతున్నా. ఒకటీ రెండు సంఘటనలు నా గురించే ఉన్నాయి. కాబట్టి మాట్లాడాలి.

చెన్నైలో నాకు ఒక ఇల్లు ఉంది. నా ఇంట్లో చాలామంది ఉన్నారు. అక్కడుంది రమాప్రభ హీరో అని ఎవరూ చెప్పడం లేదు. అందరూ అక్కడే ఉన్నారు కానీ అది నా ఇల్లు అని కాకుండా వేరేవాళ్ల ఇల్లు అని చెప్తున్నారు. నాకు నవ్వొచ్చింది. నాకు రజనీకాంత్‌ డబ్బులిచ్చారని ప్రచారం జరుగుతోంది. అది నిజం కాదు. నేను 13 ఏళ్ల నుంచే సంపాదిస్తున్నాను. ఇప్పుడు నా గురించి నోటికొచ్చింది మాట్లాడుతూ మిగతావారు సంపాదిస్తున్నారు' అని చెప్పుకొచ్చింది రమాప్రభ.

ఈ వీడియోపై నెటిజన్లు స్పందిస్తూ.. 'శరత్‌బాబు గురించి ఫీల్‌ అవుతున్నారా అమ్మ? 13 ఏళ్లు కలిసున్నారు కాబట్టి ఆ బాధ తప్పకుండా ఉంటుంది', 'శరత్‌బాబును హీరోగా నిలబెట్టడం కోసం వింత ఇల్లు సంతగోల అనే సినిమా తీసి మీరు ఎంత నష్టపోయారో నాకు తెలుసు. ఈ రోజు ఆయన కీర్తి మీ చెమట, మీ రక్తం.. వాటి పునాది మీదే ఆయన ఆనాడు నిలబడ్డారు' అని కామెంట్లు చేస్తున్నారు.

చదవండి: హీరోయిన్‌తో లవ్‌.. ముద్దు ఫోటో షేర్‌ చేసిన అజిత్‌ బావమరిది

Advertisement
 
Advertisement
Advertisement