యాచకులకు ఫుడ్‌ పంచిన హీరోయిన్‌.. ప్లీజ్‌ అలా చేయొద్దంటూ.. | Sara Ali Khan Distributes Food Packets To The Needy Outside Mumbai Shani Temple, Video Goes Viral - Sakshi
Sakshi News home page

Sara Ali Khan: భిక్షాటన చేస్తున్నవారికి స్వీట్లు పంచిన బ్యూటీ.. వీడియో వైరల్‌

Mar 31 2024 4:00 PM | Updated on Mar 31 2024 5:25 PM

Sara Ali Khan Distributes Food Outside Temple - Sakshi

దేవుడిని దర్శించుకున్న అనంతరం  బయట ఉన్న యాచకులకు స్వీట్లు పంచింది. భిక్షాటన చేస్తున్న అందరికీ స్వీటు బాక్సులు పంచుతుండటంగా అక్కడ ఉన్న మీడియావాళ్లు ఆమెను ఫోటోలు, వీడియోల్లో బంధించేందుకు ప్రయత్నించారు.దీంతో విసిగెత్తిన బ్యూటీ.. ప్లీజ్‌, ఆపేయండి. మిమ్మల్ని బతిమాలి, బతిమాలి నే

హీరోయిన్‌ అవ్వాలంటే టాలెంట్‌ ఒక్కటే ఉంటే సరిపోదు. అందం ఉండాలి. అయితే ఒకప్పుడు బొద్దుగా ఉన్నవారు హీరోయిన్లుగా నిలదొక్కుకున్నారు. కానీ ఈ తరంలో మాత్రం బొద్దుగా ఉంటే ఎక్కువకాలం ఇండస్ట్రీలో కంటిన్యూ చేయలేరు. ఇంకో ఛాయిస్‌ లేనట్లు సన్నబడి తీరాల్సిందే! అలా సారా అలీ ఖాన్‌ సైతం తన బరువు తగ్గించుకుని సన్నబడింది. హీరోయిన్‌గా సినిమాలు చేస్తోంది. 

దేవుడి దర్శనం అనంతరం..
ఈ మధ్య 'మర్డర్‌ ముబారక్‌', 'ఏ వాతా మేరే వాతా' అనే ఓటీటీ ప్రాజెక్టులతో వెబ్‌ ఆడియన్స్‌ను అలరించింది. శనివారం నాడు ఆమె ముంబై.. జుహులోని శనీశ్వరుడి ఆలయానికి వెళ్లింది. దేవుడిని దర్శించుకున్న అనంతరం  బయట ఉన్న యాచకులకు స్వీట్లు పంచింది. భిక్షాటన చేస్తున్న అందరికీ స్వీటు బాక్సులు పంచుతుండటంగా అక్కడ ఉన్న మీడియావాళ్లు ఆమెను ఫోటోలు, వీడియోల్లో బంధించేందుకు ప్రయత్నించారు.

మీరు మారరు
దీంతో విసిగెత్తిన బ్యూటీ.. ప్లీజ్‌, ఆపేయండి. మిమ్మల్ని బతిమాలి, బతిమాలి నేను అలిసిపోతున్నాను, కానీ మీరు మారడం లేదు అంటూ అసహనం వ్యక్తం చేసింది. స్వీట్లు పంచిన అనంతరం అక్కడినుంచి విసురుగా కారెక్కి వెళ్లిపోయింది. ఇందుకు సంబంధించిన వీడియో వైరల్‌గా మారింది. ప్రస్తుతం సారా అలీ ఖాన్‌ 'మెట్రో ఇన్‌ డినో' అనే సినిమా చేస్తోంది.

చదవండి: ప్రియుడితో తొలిసారి విహారయాత్రకు వెళ్లిన బ్యూటీ

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement