సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగులు వద్దు | Santana Praptirastu movie updates | Sakshi
Sakshi News home page

సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగులు వద్దు

Oct 24 2024 4:11 AM | Updated on Oct 24 2024 4:11 AM

Santana Praptirastu movie updates

పేరు ఓరుగంటి కల్యాణి. ప్రభుత్వోద్యోగి కావాలనే లక్ష్యంతో గ్రూప్స్‌కు ప్రిపేర్‌ అవుతోంది. అయితే ఇంట్లో పెళ్లి సంబంధాలు చూస్తున్నారు. కానీ తనకు కాబోయే వరుడు ప్రభుత్వోద్యోగి అయ్యుండాలని, స్మోకింగ్, డ్రింకింగ్‌ అలవాట్లు ఉండకూడదని, వెజిటేరియన్‌ అయ్యుండాలని ఆశ పడుతుంది కల్యాణి. అంతే కాదండోయ్‌... సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగి అసలే వద్దు అంటోంది. మరి... కల్యాణి ఆకాంక్షకు తగ్గ వరుడు దొరికాడా? లేదా అనేది ‘సంతాన ప్రాప్తిరస్తు’ సినిమాలో చూడొచ్చు.

 విక్రాంత్, చాందినీ చౌదరి హీరో హీరోయిన్లుగా నటిస్తున్న సినిమా ఇది. సంజీవ్‌ రెడ్డి దర్శకత్వంలో మధుర శ్రీధర్‌ రెడ్డి, నిర్వి హరిప్రసాద్‌ రెడ్డి నిర్మిస్తున్న ఈ చిత్రం త్వరలో విడుదల కానుంది. బుధవారం (అక్టోబరు 23) చాందినీ చౌదరీ బర్త్‌ డే సందర్భంగా ‘సంతాన  ప్రాప్తిరస్తు’లో ఓరుగంటి కల్యాణి పాత్రలో ఆమె నటిస్తున్నట్లుగా వెల్లడించి, ఫస్ట్‌ లుక్‌ను విడుదల చేశారు. ‘‘ప్రస్తుతం చాలామంది ఫేస్‌ చేస్తున్న సంతానలేమి సమస్య ఆధారంగా ‘సంతాన ్రపాప్తిరస్తు’ తీస్తున్నాం. రెగ్యులర్‌ షూటింగ్‌ జరుగుతోంది’’ అని తెలిపారు మేకర్స్‌.  
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement