Samantha wishes ex-brother-in-law Akhil Akkineni on his 29th birthday - Sakshi
Sakshi News home page

Samantha : అక్కినేని హీరోకు బర్త్‌డే విషెస్‌ చెప్పిన సమంత.. రిప్లై వస్తుందా?

Apr 8 2023 10:55 AM | Updated on Apr 8 2023 11:19 AM

Samantha Wishes To Akhil Akkineni On His 29th Birthday - Sakshi

అక్కినేని యంగ్‌ హీరో అఖిల్‌ పుట్టినరోజు సందర్భంగా పలువురు స్టార్స్‌ నుంచి పెద్ద ఎత్తున శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. ఈ క్రమంలో అక్కినేని మాజీ కోడలు సమంత కూడా అఖిల్‌కు బెస్ట్‌ విషెస్‌ను అందించడం విశేషం. నాగచైతన్యతో విడిపోయినా అక్కినేని కుటుంబంతో మాత్రం సమంతకు ఇప్పటికీ మంచి అనుబంధం ఉందన్నది పలుమార్లు రుజువైంది.

అక్కినేని హీరోలు అఖిల్‌, సుశాంత్‌ల సినిమాలకు ఇప్పటికీ సామ్‌ తన బెస్ట్‌ విషెస్‌ను అందిస్తూ సోషల్‌ మీడియాలో పోస్టులు పెడుతుంటుంది. అటు దగ్గుబాటి ఫ్యామిలీలోనూ రానా, మిహికా, వెంకటేశ్‌ కూతురు అశ్రితలతో ఆమెకు మంచి అనుబంధం ఉందన్నది సోషల్‌ మీడియా పోస్టులను బట్టి అర్థమవుతుంది. ఇక తాజాగా శనివారం అఖిల్‌ 29న ఏడాదిలోకి అడుగుపెడుతున్నాడు.


( ఫైల్‌ ఫోటో )

ఈ క్రమంలో అతనికి బెస్ట్‌ విషెస్‌ను అందించింది సమంత. 'హ్యాపీ బర్త్‌డే అఖిల్‌ అక్కినేని. ఎయ్‌.. ఏజెంట్‌ 28న రాబోతుంది. చూస్తుంటే ఫైర్‌లా ఉంది.. లాట్స్‌ ఆఫ్‌ లవ్‌' అంటూ హార్ట్‌ ఎమోజీని జతచేసింది. గతేడాది కూడా బర్త్‌డే సందర్భంగా సామ్‌ విషెస్‌ చెప్పినా అఖిల్‌ స్పందించలేదు. మరి ఈసారైనా సమంత షేర్‌ చేసిన పోస్ట్‌కు రిప్లై ఇస్తాడా లేదా అన్నది చూడాల్సి ఉంది. 

Advertisement
 
Advertisement
Advertisement