Samantha Shaakuntalam Movie Bags Four Awards On Cannes Film Festival - Sakshi
Sakshi News home page

Samantha Shaakuntalam Movie: కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో సత్తా చాటిన సమంత 'శాకుంతలం'..!

May 28 2023 2:43 PM | Updated on May 28 2023 3:08 PM

Samantha Shaakuntalam Movie Bags Four Awards On Cannes Film Festival - Sakshi

సమంత, దేవ్ మోహన్ ప్రధానపాత్రల్లో తెరకెక్కించిన చిత్రం 'శాకుంతలం'. గుణశేఖర్‌ దర్శకత్వంలో భారీ బడ్జెట్‌తో రూపొందిన ఈ సినిమాలో సమంత శకుంతల పాత్ర పోషించగా, దేవ్‌ మోహన్‌ దుష్యంతుడి పాత్రలో నటించారు. ఎన్నో అంచనాల మధ్య ఏప్రిల్‌ 14న ప్రపంచ వ్యాప్తంగా విడుదలైన బాక్సాఫీస్ వద్ద బోల్తా పడింది. ప్రేక్షకులు ఆశించినంత స్థాయిలో అంచనాలను అందుకోలేకపోయింది. 

(ఇది చదవండి: NTR ఫ్యామిలీలో ఒకే ఒక్క మగాడు తారక్‌: ఆర్జీవీ)

అయితే అభిమానులను మెప్పించలేకపోయిన ఈ సినిమాకు అవార్డులు మాత్రం క్యూ కడుతున్నాయి.  సమంత కెరీర్‌లోనే బిగ్గెస్ట్‌ డిజాస్టర్‌గా మిగిలిపోయిన ఈ మూవీకి గతంలో న్యూయార్క్ ఇంట‌ర్నేష‌న‌ల్ ఫిల్మ్స్ అవార్డ్స్- 2023లో బెస్ట్ ఫాంట‌సీ ఫిల్మ్‌గా,బెస్ట్ మ్యూజిక‌ల్ ఫిల్మ్‌గా అవార్డులు దక్కిన సంగతి తెలిసిందే. 

(ఇది చదవండి: హీరోల కోసం హీరోయిన్లను వెయిట్‌ చేయించేవారు: ఆదాశర్మ)

తాజాగా ఫ్రాన్స్‌లో కేన్స్ వరల్డ్ ఫిల్మ్ ఫెస్టివల్‌లోనూ అవార్డులు కొల్లగొట్టింది. ఈ సినిమాకు నాలుగు విభాగాల్లో అవార్డులు దక్కాయి. బెస్ట్ ఫారిన్ ఫిల్మ్, బెస్ట్ ఫాంటసీ ఫిల్మ్, బెస్ట్ కాస్ట్యూమ్ డిజైన్, బెస్ట్ ఇండియన్ ఫిల్మ్ కేటగిరీల్లో సత్తా చాటింది. ఈ విషయాన్ని గుణటీమ్ వర్క్స్ సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. అయితే దీనిపై నెటిజన్స్ భిన్నంగా కామెంట్స్ చేస్తున్నారు. కొందరు కంగ్రాట్స్ చెబుతుండగా.. మరికొందరేమో ఈ సినిమాకు ఎవరు ఇచ్చారు? అంటూ ట్రోల్స్ కూడా చేస్తున్నారు. కాగా థియేట‌ర్ల‌లో రిలీజై నెల రోజులు కూడా కాక‌ముందే శాకుంతలం సినిమా ఓటీటీలోకి వ‌చ్చేసిన సంగతి తెలిసిందే. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement