Samantha Ruth Prabhu: Opens Up About Her Mental Health Issues Viral - Sakshi
Sakshi News home page

Samantha: 'ఎవరి జీవితమూ పర్‌ఫెక్ట్‌ కాదు, ఎన్నో సమస్యలు ఎదుర్కొన్నా'

Jan 11 2022 8:07 AM | Updated on Jan 11 2022 10:15 AM

Samantha Opens Up About Her Mental Health Issues - Sakshi

Samantha Opens Up About Her Mental Health Issues: ‘‘నేను మానసికంగా కొన్ని సమస్యలు ఎదుర్కొన్నాను. కానీ వాటి నుంచి బయటపడగలిగాను. ఈ విషయంలో కొందరు సహాయం చేశారు’’ అన్నారు సమంత. ఇటీవల మానసిక ఆరోగ్యానికి సంబంధించిన ఓ కార్యక్రమంలో పాల్గొన్నారు సమంత. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ – ‘‘మనం ఒత్తిడితో కూడిన ప్రపంచంలో జీవిస్తున్నాం. సోషల్‌ మీడియాతో సహా ఫోకస్‌ ఎక్కువగా ఉంటుంది.

ఎక్కువ దృష్టి మనపై ఉండటం వల్ల మనల్ని ఆందోళనకు గురి చేసే అంశాలు, మన బలహీనతలు, బాధలు వంటి వాటి గురించి మాట్లాడటం ఇబ్బందిగా మారుతోంది. పర్‌ఫెక్ట్‌గా జీవించడం ఈ రోజుల్లో చాలా కష్టమైన పని. నన్ను నమ్మండి. ఎవరి జీవితమూ పర్‌ఫెక్ట్‌గా లేదు. కేవలం గ్లామర్‌ గురించి మాత్రమే కాదు.. మన జీవితాల్లోని బాధలు, ఇబ్బందికర పరిస్థితులను గురించి నాలాంటి వారు మాట్లాడితే ప్రజలు అంగీకరిస్తారనే అనుకుంటున్నాను.

ప్రతి ఒక్కరి జీవితాల్లో ఎత్తుపల్లాలు ఉంటాయి. నేను కూడా మనసికంగా ఎన్నో సమస్యలను ఎదుర్కొన్నాను. నా స్నేహితులు, కౌన్సిలర్స్, శ్రేయోభిలాషుల సలహాలు, సూచనలతో వాటి నుంచి బయటకు రాగలిగాను. అలాగే భవిష్యత్‌లో నా జీవితంలో ఎదురయ్యే సమస్యలను ఎదుర్కోవడానికి స్ట్రాంగ్‌గా ఉన్నాను. ఎందుకంటే నా స్నేహితులు, శ్రేయోభిలాషులు నాకు తోడున్నారనే నమ్మకం. ఇబ్బందిపడే కన్నా మన మానసిక సమస్యలను ఇతరులతో పంచుకోవడమే ఉత్తమం’’ అని పేర్కొన్నారు.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement