Samantha Nominated Arjun Kapoor For Attack Challenge - Sakshi
Sakshi News home page

Samantha: సమంత కొత్త ఛాలెంజ్‌.. ఆ హీరోను నామినేట్‌

Apr 1 2022 7:16 PM | Updated on Apr 2 2022 11:06 AM

Samantha Nominated Arjun Kapoor For Attack Challenge - Sakshi

టాలీవుడ్ స్టార్‌ హీరోయిన్‌ వరుస పెట్టి సినిమాలు చేస్తూ ఫుల్‌ బిజీగా ఉంది. అలాగే సోషల్‌ మీడియాలో వివిధ రకాల మోటివేషనల్‌ కొటేషన్స్‌, టూర్‌ ఫొటోలు, పెట్స్‌కు సంబంధించిన విషయాలు, వర్క్‌ అవుట్‌ పోస్ట్‌లతో నిత్యం అలరిస్తూనే ఉంటుంది సామ్. తాజాగా తన ఇన్‌స్టా వేదికగా షేర్‌ చేసిన వర్క్‌ అవుట్‌ వీడియో నెట్టింట వైరల్‌ అవుతోంది. ఈ వీడియోలో సామ్‌ హై ఆక్టేన్‌ వర్క్‌ అవుట్‌ చేస్తూ కనువిందు చేసింది. 

మనకు ఇప్పటివరకు గ్రీన్‌ ఇండియా ఛాలెంజ్‌ గురించి విన్నాం. ఇప్పుడు సెలబ్రిటీల్లో 'ఎటాక్‌ ఛాలెంజ్‌' నడుస్తోంది. ఈ ఎటాక్‌ ఛాలెంజ్‌తో సినీ తారలు మరింత ఫిట్‌గా మారనున్నారు. ఇదిలా ఉంటే టాలీవుడ్ స్టార్‌ హీరోయిన్‌ సమంత వరుస పెట్టి సినిమాలు చేస్తూ ఫుల్‌ బిజీగా ఉంది. అలాగే సోషల్‌ మీడియాలో వివిధ రకాల మోటివేషనల్‌ కొటేషన్స్‌, టూర్‌ ఫొటోలు, పెట్స్‌కు సంబంధించిన విషయాలు, వర్క్‌ అవుట్‌ పోస్ట్‌లతో నిత్యం అలరిస్తూనే ఉంటుంది సామ్. తాజాగా తన ఇన్‌స్టా వేదికగా షేర్‌ చేసిన వర్క్‌ అవుట్‌ వీడియో నెట్టింట వైరల్‌ అవుతోంది. ఈ వీడియోలో సామ్‌ హై ఆక్టేన్‌ వర్క్‌ అవుట్‌ చేస్తూ కనువిందు చేసింది. 

చదవండి: అందుకోసం ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్నా: సమంత

ఈ వర్క్‌ అవుట్‌ వీడియోను ఎటాక్‌ ఛాలెంజ్‌లో భాగంగా షేర్‌ చేసింది. ఈ ఛాలెంజ్‌ను స్వీకరించమని సామ్‌కు బాలీవుడ్‌ హీరో టైగర్ ష్రాఫ్‌ సవాలు విసిరాడు. దీంతో ఆ సవాలు స్వీకరించిన సామ్‌ వర్క్‌ అవుట్‌ వీడియోను పంచుకుంది. తర్వాత ఈ ఛాలెంజ్‌ స్వీకరించాల్సిందిగా అర్జున్‌ కపూర్‌ను నామినేట్‌ చేసింది. 'నాకు సవాలు విసిరినందుకు ధన్యవాదాలు టైగర్‌ ష్రాఫ్‌. ఇదిగో ఈ ఛాలెంజ్‌ స్వీకరించాల్సిందిగా అర్జున్‌ కపూర్‌ను నామినేట్‌ చేస్తున్నా. చూద్దాం మీరు ఎలా చేస్తారో.' అని రాస్తూ ఇన్‌స్టా వేదికగా తన వర్క్‌ అవుట్‌ వీడియోను షేర్‌ చేసింది సామ్. ఈ పోస్ట్‌కు 'నేను కచ్చితంగా ఇలా చేయలేను' అని అర్జున్‌ కపూర్‌ రిప్లై ఇచ్చాడు. కాగా ఈ ఎటాక్‌ ఛాలెంజ్‌ను టైగర్‌ ష్రాఫ్‌కు కూల్‌ బ్యూటీ రకుల్ ప్రీత్‌ సింగ్‌ సవాలు విసిరింది. తర్వాత వారి వెర్షన్‌లను చూపించమని సమంత, నిర్మాత జాకీ భగ్నానీలను నామినేట్‌ చేశాడు టైగర్ ష్రాఫ్‌.

చదవండి: సమంత లేటెస్ట్‌ వీడియో.. వావ్‌ అనిపించేలా


బాలీవుడ్ హ్యాండ్సమ్‌ హంక్‌ జాన్ అబ్రహం, బ్యూటీ జాక్వెలిన్‌ ఫెర్నాండేజ్, రకుల్‌ ప్రీత్ సింగ్‌ కలిసి నటించిన చిత్రం 'ఎటాక్: 1'. లక్ష్య రాజ్‌ ఆనంద్ తెరకెక్కించిన ఈ చిత్రం ఏప్రిల్‌ 1న ప్రపంచవ్యాప్తంగా విడుదలైంది. ఈ సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా రకుల్‌ ప్రీత్, జాక్వెలిన్‌ ఈ 'ఎటాక్‌ ఛాలెంజ్‌'ను నిర్వహించారు. 
 

Advertisement
 
Advertisement
Advertisement