టాలీవుడ్ హీరోయిన్ సమంత లీడ్ రోల్లో వచ్చిన లేటేస్ట్ మూవీ మా ఇంటి బంగారం. ఈ సినిమాకు నందిని రెడ్డి దర్శకత్వం వహించారు. జూన్ 19న థియేటర్లలో రిలీజైన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద అదిరిపోయే వసూళ్లు రాబట్టింది. ఈ సినిమా ఏకంగా రూ.80 కోట్లకు పైగా కలెక్షన్స్ వసూలు చేసింది. దీంతో టాలీవుడ్ చరిత్రలోనే అత్యధిక వసూళ్లు సాధించిన లేడీ ఓరియంటేడ్ మూవీగా నిలిచింది.
దీంతో మా ఇంటి బంగారం టీమ్ ఫుల్ ఖుషీలో ఉన్నారు. ఇప్పటికే ఈ సినిమా నార్త్ అమెరికాలో 2 మిలియన్ల డాలర్ల మార్క్‌ను దాటేసింది. మూడో వారాంతంలోనూ మా ఇంటి బంగారం వసూళ్లపరంగా రాణించడం చూస్తుంటే సమంత క్రేజ్ ఏంటో అర్థమవుతోంది. కాగా.. ఈ చిత్రంలో గుల్షన్ దేవయ్య, దిగంత్ మంచాలే, గౌతమి, శ్రీముఖి కీలక పాత్రలు పోషించారు.
అంతేకాకుండా మరో రెండేళ్లలో ఈ సినిమాకు సీక్వెల్ రాబోతున్నట్లు సమంత భర్త రాజ్ నిడిమోరు ప్రకటించారు. ఒక సినిమాకు పార్ట్-2 చేయాలనే ఆలోచన రావడం ఇదే తొలిసారి అని అన్నారు. కాగా.. ఈ చిత్రానికి సంగీతాన్ని సంతోష్ నారాయణన్ అందించారు.
#MaaIntiBangaaram continues its golden run at the box office ❤🔥
Running successfully in its 3rd week with superb bookings 🔥
Enjoy the BIGGEST EVER FEMALE-LED TELUGU FILM in theatres ❤🔥
Book your tickets now!
🎟️ https://t.co/P89ifZn9Ss@TralalaPictures @Samanthaprabhu2… pic.twitter.com/EN6b1vXanR— Tralala Moving Pictures (@TralalaPictures) July 4, 2026


