Samantha Comment On Allu Arjun Wife Sneha Reddy Pic, Goes Viral - Sakshi
Sakshi News home page

Samantha: అల్లు అర్జున్‌ భార్యపై సమంత 'హాట్‌' కామెంట్స్‌ వైరల్‌

Dec 23 2021 3:29 PM | Updated on Dec 24 2021 7:22 AM

Samantha Comment On Allu Arjun Wife Sneha Reddy Pic Goes Viral - Sakshi

Samantha Comment On Allu Arjun Wife Sneha Reddy Pic, Goes Viral: అల్లు అర్జున్‌ భార్య స్నేహారెడ్డికి సోషల్‌ మీడియాలో మాంచి ఫాలోయింగ్‌ ఉన్న సంగతి తెలిసిందే. కూతురు, కొడుకుతో కలిసి బన్ని చేసే అల్లరి ఫొటోలు, వీడియోలను స్నేహా రెడ్డి తరుచూ సోషల్‌ మీడియాలో షేర్‌ చేస్తుంటారు. ముఖ్యంగా ఇన్‌స్టాగ్రామ్‌లో తెగ యాక్టివ్‌గా ఉండే స్నేహ ఫాలోవర్లు కూడా ఎక్కువే. తాజాగా స్నేహరెడ్డి కొన్ని ఫోటోలను షేర్‌ చేశారు. మల్హోత్ర డిజైన్ చేసిన నలుపు రంగు చీరలో స్నేహ ఎంతో అందంగా కనిపించారు.

సమంత స్టైలిస్ట్‌ ప్రీతమ్‌ జుకల్కర్‌ స్నేహకు స్టైలింగ్‌ చేశారు. దీనికి సంబంధించిన ఫోటోలను స్నేహరెడ్డి తన ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్‌ చేయగా పలువురు సెలబ్రిటీలు సైతం స్నేహపై ప్రశంసలు కురిపించారు. స్టార్‌ హీరోయిన్‌ సమంత సైతం హాట్‌.. అంటూ కామెంట్‌ చేసింది. ప్రస్తుతం దీనికి సంబంధించిన స్క్రీన్‌ షాట్స్‌ నెట్టింట చక్కర్లు కొడుతున్నాయి. కాగా అల్లు అర్జున్‌ నటించిన 'పుష్ప' సినిమాలో సమంత స్పెషల్‌ సాంగ్‌లో కనిపించిన సంగతి తెలిసిందే. 

చదవండి: చై నుంచి రూ.50 కోట్లు దోచుకుందంటూ ట్వీట్‌.. స్పందించిన సామ్‌

Advertisement
 
Advertisement
Advertisement