Samantha Akkineni Shares Most Memorable Photo With Naga Chaitanya | ఎప్పటికీ గుర్తుండిపోయే ఫొటో - Sakshi
Sakshi News home page

ఎప్పటికీ గుర్తుండిపోయే ఫొటో: సామ్‌

Dec 24 2020 5:07 PM | Updated on Dec 24 2020 6:32 PM

Samantha Akkineni Shares Most Memorable Photo - Sakshi

ఒక్క సినిమా సమంత జీవితాన్నే మార్చివేసింది. ఏం మాయ చేసావే.. సినిమాతో వెండితెరకు పరిచయమైన ఆమె తొలి సినిమాతోనే అందరినీ ఆకర్షించింది. తన చిలిపి నవ్వుతో అబ్బాయిల గుండెల్లో పువ్వుల బాణాల్ని విసిరింది. ఎంతోమందికి అభిమాన తారగా మారింది. అలా అందరి కళ్లు సమంత మీద ఉంటే ఆమె మాత్రం ఒకరి కోసం తపించింది. అతడెవరో కాదు హీరో నాగచైతన్య. ఏమాయ చేసావే చిత్రం.. వీరిద్దరూ ఒకరిని విడిచి ఒకరు ఉండలేనంతగా వాళ్ల మనసులను మాయ చేసింది. దీంతో 2017లో మూడుముళ్ల బంధంతో వైవాహిక బంధంలోకి అడుగు పెట్టారు. పెళ్లయి మూడేళ్లవుతున్నా ఇప్పటికీ కొత్త జంటగానే కనిపిస్తూనే ఉంటారు. ఎక్కడికి వెళ్లినా ఈ జోడీ సెంటరాఫ్‌ అట్రాక్షన్‌గా ఉంటుంది. (చదవండి: బాలీవుడ్‌లో ఒకే.. సౌత్‌లో కుదరదు)

తాజాగా సామ్‌ తన భర్త చైతో దిగిన తొలి ఫొటోను(ఏ మాయ చేసావే సినిమా సమయంలో దిగిన ఫొటో) సోషల్‌ మీడియాలో అభిమానులతో పంచుకుంది. ఇది తనకు ఎప్పటికీ గుర్తుండిపోయే ఫొటో అని చెప్పుకొచ్చింది. ఇక ఈ మధ్యే మాల్దీవులకు వెళ్లిన ఈ జంట చై బర్త్‌డేను అక్కడే సెలబ్రేట్‌ చేసింది. కాగా ఫ్యామిలీ మ్యాన్‌ 2తో ఓటీటీలోకి ప్రవేశిస్తున్న సమంత‌ ప్రస్తుతం ఆహాలో సామ్‌ జామ్‌ కార్యక్రమానికి వ్యాఖ్యాతగా వ్యవహరిస్తోంది. మరోవైపు హీరోగా 20 సినిమాలు పూర్తి చేసిన నాగ చైతన్య ఈ సారి ముగ్గురు హీరోయిన్లతో కలిసి నటించనున్నారని టాక్‌ వినిపిస్తోంది. విక్రమ్‌ కె. కుమార్‌ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రానికి ‘థ్యాంక్యూ’ టైటిల్‌ ఖరారు చేయగా, ఇందులో చై పల్లెటూరి కుర్రాడు, ఎన్నారైగా కనిపించనున్నారట.  (చదవండి: శ్రీవారికి పెళ్లిరోజు శుభాకాంక్షలు: సమంత)

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement