శ్రీవారికి పెళ్లిరోజు శుభాకాంక్షలు: సమంత

‘పై లోకంలో వాడు ఎపుడో ముడివేశాడు..’ అంటూ పదేళ్ల క్రితం డ్యూయెట్ పాడుకుందో అందమైన ప్రేమజంట. ఆ తర్వాత రెండు సినిమాల్లో కలిసి నటించి కనువిందు చేసింది. దీంతో స్క్రీన్‌పై ఇంత క్యూట్‌గా ఉన్న ఈ జంట... రియల్ లైఫ్‌లోనూ జోడీ కడితే ఎంత బాగుంటుందో కదా అంటూ ఆశపడని అభిమాని ఉండరంటే అతిశయోక్తి కాదు. వారి ఆశను నిజం చేస్తూ ప్రాణ స్నేహితులైన తాము.. దంపతులుగా మారి జీవితాన్ని పంచుకోబోతున్నట్లు ప్రకటించి.. 2017 అక్టోబరు 6న మూడుముళ్ల బంధంతో ఒక్కటైంది. మనసులు కలిస్తే చాలు.. ఎన్ని అవాంతరాలు ఎదురైనా సరే కలిసి జీవించాలనే కోరిక బలంగా ఉంటే చాలు నిరూపించిన ఆ జంటే ‘చైసామ్’.
టాలీవుడ్‌లో మోస్ట్ రొమాంటిక్ కపుల్‌గా పేరొందిన సమంత- నాగ చైతన్య మంగళవారం నాడు మూడో వివాహ వార్షికోత్సవం పూర్తి చేసుకున్నారు. ఈ సందర్భంగా భర్తతో కలిసి ఉన్న ఫొటో షేర్ చేసిన సామ్.. ‘‘నువ్వు నా వాడివి. నేను నీ దానిని, ఎల్లవేళలా కలిసే ఉంటూ జీవితంలోని అన్ని మలుపులను కలిసి స్వాగతిద్దాం. శ్రీవారికి పెళ్లిరోజు శుభాకాంక్షలు’’అంటూ నాగ చైతన్యపై ప్రేమను చాటుకున్నారు. ఈ క్రమంలో సోషల్ మీడియా వేదికగా చై- సామ్‌లపై శుభాకాంక్షల వర్షం కురిసింది.
అదే విధంగా చైతూ కజిన్ రానా దగ్గుబాటితో పాటు వ్యాపారవేత్త ఉపాసన వంటి సెలబ్రిటీలు సైతం వారిని విష్ చేశారు. ఇక పెళ్లి తర్వాత కూడా సామ్ నటన కొనసాగిస్తున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ఇద్దరు మరోసారి జంటగా నటించిన మజిలీ చిత్రం ఎంతటి విజయం సాధించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. కాగా కెరీర్ పరంగా ఎంత బిజీగా ఉన్నా ఒకరికోసం ఒకరు టైమ్ కేటాయించుకుంటూ.. వీలు చిక్కినప్పుడల్లా హాలిడే ట్రిప్ ఎంజాయ్ చేస్తూ ఇటు పర్సనల్ లైఫ్‌ను, అటు ప్రొఫెషనల్ లైఫ్‌నూ సక్సెస్‌ఫుల్‌గా లీడ్ చేస్తూ ఆదర్శంగా నిలుస్తున్నారు చైసామ్‌లు.
.
*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి