
సల్మాన్ ఖాన్ లేటెస్ట్ మూవీ సికిందర్. రష్మిక హీరోయిన్. ఈద్ సందర్భంగా ఆదివారం (మార్చి 30) థియేటర్లలో రిలీజైంది. మొదటి ఆట నుంచి దీనికి నెగిటివ్ టాక్ బయటకొచ్చింది. రొట్టకొట్టుడు స్టోరీకి తోడు సల్మాన్ యాక్టింగ్ నీరసంగా ఉందనే కామెంట్స్ వినిపించాయి. మరి తొలిరోజు కలెక్షన్స్ ఎన్నికోట్లు వచ్చాయి?
(ఇదీ చదవండి: 'మ్యాడ్ స్క్వేర్' మూడు రోజుల కలెక్షన్లు)
చాలా ఏళ్లుగా సల్మాన్ సినిమాలు చేస్తున్నాడు. కానీ ఒక్కటంటే ఒక్కటీ హిట్ అవ్వట్లేదు. దీంతో ఈ సారి తమిళ దర్శకుడు ఏఆర్ మురగదాస్ తో కలిసి సికిందర్ తీశాడు. హిట్ బ్యూటీ రష్మిక ఉండటంతో కాస్త అంచనాలు ఏర్పడ్డాయి. కానీ టీజర్, ట్రైలర్ దెబ్బకు మూవీపై ఉన్న హైప్ అంతా పోయింది. సినిమా కూడా అలానే ఉందని, చూసిన ప్రేక్షకులు చెబుతున్నారు.
ఇకపోతే రిలీజ్ కి ముందు రోజు అంటే శనివారం రాత్రి.. సికిందర్ పైరసీ హెచ్ డీ ప్రింట్ పలు వెబ్ సైట్లలో దర్శనమిచ్చింది. అలా ప్రతికూల అంశాలతో రిలీజైన ఈ మూవీకి తొలిరోజు కేవలం రూ.26 కోట్లు మాత్రమే వచ్చినట్లు ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. సల్మాన్ లాంటి స్టార్ హీరో.. తొలిరోజు ఈ వసూళ్లు అంటే చాలా తక్కువనే చెప్పాలి. మరి ఓవరాల్ గా ఎంత కలెక్ట్ చేస్తుందో చూడాలి?
(ఇదీ చదవండి: కాస్ట్ లీ కారు కొన్న ప్రభాస్ హీరోయిన్.. రేటు ఎంతంటే?)