'మ్యాడ్‌ స్క్వేర్‌' మూడురోజుల్లోనే కలెక్షన్ల రికార్డ్స్‌ క్లబ్‌లో ఎంట్రీ | Mad Square movie 3 Days Collections Out Now | Sakshi
Sakshi News home page

'మ్యాడ్‌ స్క్వేర్‌' మూడురోజుల్లోనే కలెక్షన్ల రికార్డ్స్‌ క్లబ్‌లో ఎంట్రీ

Mar 31 2025 12:43 PM | Updated on Mar 31 2025 3:40 PM

Mad Square movie 3 Days Collections Out Now

మ్యాడ్‌ స్క్వేర్‌(Mad Square) సినిమాతో బాక్సాఫీస్‌ను షేక్‌ చేస్తున్నారు.  మార్చి 28 సినిమా విడుదలైన ఈ మూవీ భారీ కలెక్షన్ల దిశగా దూసుకెళ్తుంది. థియేటర్స్‌ రన్‌లో గట్టి పోటీ ఉన్నప్పటికీ నవ్వులు, పంచ్‌ డైలాగ్స్‌తో మ్యాడ్‌ గ్యాంగ్‌  దుమ్మురేపుతున్నారు. అందరి అంచనాలను దాటేసి ఎవరూ ఊహించలేని కలెక్షన్లను ఈ సినిమా రాబడుతుంది.  మ్యాడ్ స్క్వేర్ చిత్రం కేవలం మూడోరోజుల్లోనే ఫస్ట్‌ మైలురాయిని దాటేసింది.

2023లో విడుదలైన హిట్‌ సినిమా ‘మ్యాడ్‌’ (Mad) చిత్రానికి ఇది కొనసాగింపుగా  మ్యాడ్‌ స్క్వేర్‌ చిత్రాన్ని దర్శకుడు కల్యాణ్ శంకర్‌ తెరకెక్కించారు.
నార్నె నితిన్‌, సంగీత్‌ శోభన్‌, రామ్‌ నితిన్‌ మరోసారి తమ కామెడీ టైమింగ్‌తో ప్రేక్షకులను థియేటర్స్‌కు రప్పిస్తున్నారు. సూర్యదేవర హారిక, సాయి సౌజన్య సంయుక్తంగా ఈ చిత్రాన్ని సుమారు రూ. 10 కోట్లకు పైగా బడ్జెట్‌తో నిర్మించారు. అయితే, మూడురోజుల్లోనే ఈ మూవీ రూ. 50.2 కోట్ల గ్రాస్‌ కలెక్షన్స్‌ రాబట్టినట్లు మేకర్స్‌ అధికారికంగా ప్రకటించారు. 

మొదటిరోజే రూ. 20.8 కోట్లు,  రెండో రోజు రూ. 16.4 కోట్లు, మూడోరోజు రూ. 13 కోట్లు రాబట్టి రికార్డ్ క్రియేట్‌ చేసింది. అయితే, నేడు రంజాన్‌ ఉంది కాబట్టి మ్యాడ్‌ స్క్వేర్‌ కలెక్షన్స్‌ మరింతగా పెరగవచ్చని అంచనా వేస్తున్నారు.   ఓవర్సీస్‌లో కూడా ఈ మూవీ సత్తా చాటుతుంది. అక్కడ వన్‌ మిలియన్‌ డాలర్ల క్లబ్‌లో చేరింది. ఇలా ప్రపంచవ్యాప్తంగా మ్యాడ్‌ గ్యాంగ్‌ పిచ్చెక్కిస్తోంది అంటూ కామెంట్లు పెడుతున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement