Salman Khan: జర్నలిస్ట్‌పై దాడి, సల్మాన్‌, ఆయన బాడీగార్డ్‌కు కోర్టు నోటీసులు

Salman Khan Gets Court Notice For Misbehaving With Journalist - Sakshi

బాలీవుడ్‌ ‘భాయిజాన్‌’, కండల వీరుడు సల్మాన్‌ ఖాన్‌ క్రేజ్‌ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. కేవలం భారత్‌లోనే విదేశాల్లో సైతం ఆయనకు మంచి ఫ్యాన్‌ ఫాలోయింగ్‌ ఉంది. ఇక ఆయన పేరు సినిమాలో కంటే కూడా హీరోయిన్స్‌తో సల్మాన్‌ ఎఫైర్స్‌ అంటూ ఎక్కువగా వినిపిస్తుంది. ఇదిలా ఉంటే సల్మాన్‌ను తరచూ ఏదో ఒక వివాదం వెంటాడుతూ ఉంటుంది. ఇప్పటికే కృష్ణ జింకను చంపిన కేసులో సల్మాన్‌పై ఆరోపణలు ఉన్న సంగతి తెలిసిందే.

చదవండి: కారులో ‘సీక్రెట్‌ ఫ్రెండ్‌’తో అడ్డంగా బుక్కైన స్టార్‌ హీరో కూతురు

దీనితో పాటు ఓ జర్నలిస్ట్‌పై దాడి వివాదంలో కూడా చిక్కుకున్నాడు. 2019లో జరిగిన ఈ సంఘటన అప్పట్లో సంచలనం సృష్టించింది. తాజాగా ఈ కేసులో సల్మాన్‌, ఆయన బాడీగార్డ్‌ నవాజ్‌ షేక్‌కు అంధేరి కోర్టు సమన్లు జారీ చేసింది. సదరు జర్నలిస్ట్‌ అశోక్‌ పాండే.. సల్మాన్‌, ఆయన బాడీగార్డ్‌ నవాజ్‌ షేక్‌పై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కోరుతూ కోర్టును ఆశ్రయించాడు. అతడి ఫిర్యాదు మేరకు లోకల్‌ పోలీసులను ఈ కేసు విచారణ చెప్పట్టాల్సిందిగా కోర్డు ఆదేశించింది. ఇటీవల దీనిపై పోలీసులు ఇచ్చిన రిపోర్ట్‌ సల్మాన్‌, ఆయన బాడీగార్డ్‌కు ప్రతికూలంగా ఉంది.

చదవండి: ‘ది కశ్మీర్‌ ఫైల్స్‌’ను ఉద్దేశిస్తూ బాలీవుడ్‌పై ఆర్జీవీ షాకింగ్‌ ట్వీట్‌

దీంతో మెట్రోపాలిటన్‌ మేజిస్ట్రేట్‌ను ఆర్‌ఆర్‌ ఖాన్‌ తాజాగా జారీ చేసిన ఉత్తర్వు జారీ చేస్తూ సల్మాన్‌, ఆయన బాడీగార్డ్‌పై ఐపీసీ సెక్షన్‌ 504, 506 కింద కేసు నమోదైనట్లు పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో అంధేరీ కోర్టు వారికి నోటిసులు జారీ చేసి తదుపరి విచారణను ఏప్రిల్‌ 5కి వాయిదా వేసింది. కాగా 2019లో ముంబై రోడ్డులో సైక్లింగ్‌ చేస్తుండగా సల్మాన్‌ తన ఫోన్‌ లాక్కున్నట్లు ఫిర్యాదులో పేర్కొన్నాడు. అదే సమయంలో మీడియా ఆయనను ఫొటోలు తీస్తున్నారని, ఈ క్రమంలో సల్మాన్‌ ఖాన్‌, ఆయన బాడీగార్డ్‌ తన దగ్గరికి వచ్చి ఫోన్‌ లాగేసుకుని బెదరించినట్లు అశోక్‌ పాండే ఆరోపించాడు. 

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top