కోట్ల విలువైన కారును కొన్న సల్మాన్‌ ఖాన్ బాడీగార్డ్‌! | Salman Khan Bodyguard Shera Recently Bought A New Luxury Range Rover, Photo Goes Viral | Sakshi
Sakshi News home page

Salman Khan: రేంజ్‌ రోవర్‌ కారు కొన్న సల్మాన్‌ ఖాన్ బాడీగార్డ్‌!

Aug 29 2024 2:04 PM | Updated on Aug 29 2024 3:16 PM

Salman Khan bodyguardShera recently bought a new Range Rover

బాలీవుడ్ స్టార్‌, కండల వీరుడు సల్మాన్ ఖాన్‌ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ప్రస్తుతం ఆయన సికిందర్ చిత్రంలో నటిస్తున్నారు. ఏఆర్ మురుగదాస్ డైరెక్షన్‌లో రానున్న ఈ చిత్రంలో నేషనల్ క్రష్ ‍రష్మిక మందన్నా హీరోయిన్‌గా కనిపించనుంది. అయితే ఇటీవల సల్మాన్‌ఖాన్‌కు పక్కటెములకు గాయాలు కావడంతో ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్‌కు దూరంగా ఉ‍న్నారు. తమ హీరో త్వరగా కోలుకోవాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. గాయం అయినప్పటికీ తాజాగా ముంబయిలో జరిగిన ఓ ఈవెంట్‌కు హాజరయ్యారు.

అయితే తాజాగా సల్మాన్‌ ఖాన్‌కు బాడీగార్డ్‌ షేరా ఖరీదైన లగ్జరీ కారును కొనుగోలు చేశాడు.  1995 నుంచి సల్మాన్‌కు బాడీగార్డ్‌గా పనిచేసిన షేరా కొత్త రేంజ్‌ రోవర్‌ను కొన్నారు. దీనికి సంబంధించిన ఫోటోలను తన ఇన్‌స్టాలో షేర్ చేశారు. ఈ కారు విలువ దాదాపుగా రూ.1.4 కోట్లుగా ఉంటుందని సమాచారం. షేరా అసలు పేరు గుర్మీత్ సింగ్ జాలీ కాగా.. సల్మాన్‌కు బాడీగార్డ్‌గా పని చేయడమే కాకుండా టైగర్ సెక్యూరిటీ అనే సంస్థను స్థాపించారు. 
 

Advertisement
 
Advertisement
Advertisement