ఆ రొమాంటిక్ సీన్లంటే ఇప్పటికీ ఇష్టం: సీనియర్ హీరోయిన్ | Saira Banu Reveals Her Favourite Scene With Amitabh Bachchan and Vinod | Sakshi
Sakshi News home page

Saira Banu: అమితాబ్‌తో రొమాంటిక్‌గా ఉంటే అడ్డుకునేవాడు: సైరా భాను

Oct 1 2023 7:04 PM | Updated on Oct 1 2023 7:05 PM

Saira Banu Reveals Her Favourite Scene With Amitabh Bachchan and Vinod - Sakshi

బాలీవుడ్‌ సీనియర్ హీరోయిన్ సైరా భాను నటించిన సూపర్ హిట్ చిత్రం హేరా ఫేరీ. ఈ చిత్రంలో అగ్రనటులైన వినోద్ ఖన్నా, అమితాబ్ బచ్చన్ జంటగా నటించారు.  ఈ మూవీ రిలీజై నేటికి 47 ఏళ్లు పూర్తయిన సందర్భంగా ఆ రోజులను సైరా భాను గుర్తు చేసుకున్నారు. వినోద్ ఖన్నా,  అమితాబ్ బచ్చన్‌లతో కలిసి పనిచేసిన అనుభవాలను తలుచుకుంటూ ఇన్‌స్టాలో పోస్ట్ చేశారు. 

ఇన్‌స్టా సైరా రాస్తూ..' హేరా ఫేరి చేయడం చాలా సంతోషంగా ఉంది. అమితాబ్ బచ్చన్, వినోద్ ఖన్నా కూడా నటించారు. దర్శకుడు ప్రకాష్ మెహ్రా మా ముగ్గురికి పూర్తి స్వేచ్ఛనిచ్చాడు. ఆ సమయంలో మేము సినిమాలోని సన్నివేశాలను చాలా ఫన్నీగా మార్చేశాం. ముఖ్యంగా వినోద్ నిరంతరం అమితాబ్‌ను నాతో క్లోజ్‌గా ఉన్నందున.. వాటిని ఆపేందుకు అతను ప్రయత్నిస్తున్న సన్నివేశాలంటే నాకు ఇప్పటికీ ఇష్టం. వినోద్ నా పక్కన కూర్చోవడానికి.. అమితాబ్‌ ప్రయత్నాలను అడ్డుకోవాలని చూసే దృశ్యాలు ఇప్పటికీ ఆనందం కలిగిస్తాయి.  మీరు కూడా చూసి ఆనందించండి' అంటూ పోస్ట్ చేసింది. ఇది చూసిన ఫ్యాన్స్ సైతం మీ ముగ్గురి కాంబినేషన్ అదిరిపోయిందంటూ కామెంట్స్ చేస్తున్నారు. 

కాగా.. 1976లో  విడుదలైన హేరా ఫేరి ఒక కామెడీ చిత్రం. దీనికి ప్రకాష్ మెహ్రా దర్శకత్వం వహించారు.  అమితాబ్ బచ్చన్, వినోద్ ఖన్నా, సైరా బాను, ప్రాణ్‌ ఇందులో  నటించారు. నగరంలో జీవనోపాధి కోసం కష్టపడుతున్న విజయ్ (అమితాబ్ బచ్చన్), అజయ్ (వినోద్ ఖన్నా) అనే ఇద్దరు స్నేహితుల చుట్టూ కథ తిరుగుతుంది. కాగా.. దివంగత నటుడు, సైరా భాను భర్త దిలీప్ కుమార్ వర్ధంతి సందర్భంగా ఈ ఏడాది జూలై 7న సైరా బాను తన ఇన్‌స్టాగ్రామ్‌లోకి అడుగుపెట్టిన సంగతి తెలిసిందే. 

Advertisement
 
Advertisement
Advertisement