'సైంధవ్‌'లో ఆ రేంజ్‌ ఎమోషన్‌ ఉంది: నిర్మాత వెంకట్‌ | Saindhav movie releases on January 13: Venkat Boyanapalli | Sakshi
Sakshi News home page

'సైంధవ్‌'లో ఆ రేంజ్‌ ఎమోషన్‌ ఉంది: నిర్మాత వెంకట్‌

Jan 6 2024 2:01 AM | Updated on Jan 6 2024 6:34 AM

Saindhav movie releases on January 13: Venkat Boyanapalli - Sakshi

‘‘హిట్‌’ ట్రైలర్‌ చూసి, డైరెక్టర్‌ శైలేష్‌తో ఓ సినిమా చేయాలనుకున్నాను. వెంకటేశ్‌గారికి శైలేష్‌ కథ చెప్పారు. సాధారణంగా వెంకటేశ్‌గారితో సినిమా అంత సులభంగా వర్కౌట్‌ కాదని, సురేష్‌బాబుగారు కథల విషయంలో స్ట్రిక్ట్‌గా ఉంటారనే మాటలు వినిపిస్తుంటాయి. కానీ నేను ఇండియాలో విమానం ఎక్కి, అమెరికాలో దిగే సరికి ‘సైంధవ్‌’ సినిమా ఓకే అయ్యింది’’ అన్నారు  వెంకట్‌ బోయనపల్లి. వెంకటేశ్‌ హీరోగా శైలేష్‌ కొలను దర్శకత్వంలో వెంకట్‌ బోయనపల్లి నిర్మించిన ‘సైంధవ్‌’ ఈ నెల 13న విడుదల కానుంది. ఈ సందర్భంగా శుక్రవారం జరిగిన విలేకర్ల సమావేశంలో వెంకట్‌ బోయనపల్లి చెప్పిన విశేషాలు.

► వెంకటేశ్‌–నానీగార్ల కాంబినేషన్‌లో మా బ్యానర్‌లో ఓ సినిమా చేయాలనుకున్నాను.. కుదర్లేదు. మా బ్యానర్‌లో తొలి సినిమాగా నానీగారు హీరోగా ‘శ్యామ్‌ సింగరాయ్‌’ తీశాం. ఇప్పుడు వెంకటేశ్‌గారి 75వ సినిమా ‘సైంధవ్‌’ను నిర్మించడాన్ని అదృష్టంగా భావిస్తున్నా. ఇక వెంకటేశ్‌–నానీగార్ల మల్టీస్టారర్‌ ఫిల్మ్‌కు మంచి కథ కుదిరితే నిర్మించడానికి రెడీగా ఉన్నాను.

► ‘సైంధవ్‌’ను వెంకటేశ్, సురేష్‌బాబుగార్లు చూసి, హ్యాపీ ఫీలయ్యారు. కృష్ణా, గుంటూరు జిల్లా హక్కులను సురేష్‌గారే తీసుకున్నారు. ఈ సినిమా కథ విన్నప్పుడే భారీ ఖర్చుతో కూడుకున్నది అర్థమై, గ్రాండ్‌గా నిర్మించాం. ‘సైంధవ్‌’ను చూసే ప్రేక్షకులు దాదాపు గంటసేపు కన్నీళ్లు పెట్టుకుంటారు. ఆ రేంజ్‌ ఎమోషన్‌ ఈ సినిమాలో ఉంది.

► పాన్‌–ఇండియా అంటూ కొంత బడ్జెట్‌ కేటాయించి మరీ ఇతర రాష్ట్రాల్లో ప్రమోషన్‌కు పరిగెడుతున్నారు.ఈ క్రమంలో తెలుగును మర్చిపోతున్నారు. కానీ మేం తెలుగుకు ప్రాధాన్యం ఇచ్చాం. ‘కాంతార’ వంటి కన్నడ చిత్రాలు ముందుగా మాతృ భాషలో విడుదలై, ఆ తర్వాత ఇతర భాషల్లోనూ హిట్‌ అయ్యాయి. ప్రస్తుతం నిర్మాతలకు పాన్‌ ఇండియా మార్కెట్‌ అంత లాభసాటిగా ఏం లేదు. మా వరకు ఓటీటీ, శాటిలైట్‌ బిజినెస్‌ బాగా జరిగింది. ఈ సంక్రాంతి రేసు నుంచి ‘ఈగల్‌’ను వాయిదా వేయడం ఆ చిత్రం యూనిట్‌ గొప్పదనం.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement