పరీక్షలు రాసిన సాయి పల్లవి | Sai Pallavi Steps Out to Write an FMGE Exams, Fans Delighted to Click a Photo With Her - Sakshi
Sakshi News home page

పరీక్షలు రాసిన సాయి పల్లవి

Sep 2 2020 9:09 PM | Updated on Sep 3 2020 4:52 PM

Sai Pallavi Steps Out Write Exam Photos Viral - Sakshi

తన డాన్స్‌తో, నటనతో ప్రేక్షకులను ఫిదా చేసిన  హీరోయిన్ సాయి పల్లవి. మలయాళ చిత్రం ప్రేమమ్‌ ద్వారా కథానాయికగా పరిచయమైన ఈ బ్యూటీ తక్కువ సమయంలోనే మంచి గుర్తింపు తెచ్చుకుంది.  మలయాళం, తమిళం భాషల్లో కంటే తెలుగులోనే సాయి పల్లవికి మంచి గుర్తింపు లభించింది. ఇప్పుడు అక్కడ మంచి క్రేజ్‌ వున్న నటిగా రాణిస్తోంది. తమిళంలో మూడు చిత్రాల్లో నటించిన ఆమెకు అక్కడ ఆశించిన విజయం లభించలేదు. కాగా తెలుగులో కథానాయికగా బిజీగా వున్న సాయిపల్లవి ప్రస్తుతం కరోనా కాలంలో పరీక్షలకు ప్రిపేర్‌ అయ్యింది. మంగళవారం ఆమె తిరుచ్చికి వెళ్ళి అక్కడ ఎంఏఎం కళాశాలలో పరీక్షలు రాసింది. 
(చదవండి : థియేటర్లోనే ప్రేమకథ)

విదేశాల్లో వైద్య విద్యను పూర్తి చేసిన సాయి పల్లవి ఇటీవల నేషనల్ బోర్డు ఆఫ్ ఎగ్జామినేషన్ నిర్వహించే ఫారీన్ మెడికల్ గ్రాడ్యుయేట్ ఎగ్జామినేషన్ ( ఎఫ్‌ఎంజీఈ)పరీక్షకు హాజరయ్యారు. మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా, స్టేట్ మెడికల్ కౌన్సిల్‌లో డాక్టర్‌గా రిజిస్టర్ చేసుకోవాలంటే ఈ పరీక్షలో తప్పనిసరిగా ఉత్తీర్ణులవ్వాల్సి ఉంటుంది. ఈ నేపథ్యంలో తిరుచిలోని ఎంఏఎం కాలేజీలో జరిగిన పరీక్షకు హాజరయ్యారు. అదే కళాశాలకు పరీక్షలు రాయడానికి వచ్చిన ఇతర విద్యార్థులు అక్కడ సాయిపల్లవిని చూసి ఆశ్చర్యపోయారు. అనంతరం ఆమెతో కలిసి ఫోటో దిగడానికి, ఆటోగ్రాఫ్‌లు తీసుకోవడానికి ఉత్సాహం చూపారు. ఇకపోతే ఆమె అక్కడి విద్యార్థులతో దిగిన ఫోటోలు సామాజిక మాధ్యమాలలో వైరల్‌ అవుతున్నాయి. (చదవండి : కొరియోగ్రాఫర్‌ అవతారం ఎత్తనున్న హీరోయిన్‌?!)

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement